Site icon Prime9

Amazon great India festive sale 2022: అమెజాన్ బంపర్ ఆఫర్.. 80శాతం తగ్గింపుతో అందుబాటులోకి వస్తువులు

amazon great india festive sale 2022

amazon great india festive sale 2022

Amazon great India festive sale: పండగకు ముందే వినియోగదారులకు అమెజాన్ గుడ్‌న్యూస్ చెప్పింది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అమెజాన్ గ్రేట్ ఇండియా ఫెస్టివల్ సేల్ మ‌రి కొద్ది రోజుల్లో ప్రారంభంకానుంది. ఈ సేల్‌ లో వ‌స్తువుల‌ను కొనుగోలు చేయ‌డం వల్ల 80 శాతం వ‌ర‌కూ భారీ తగ్గింపుతో ల‌భిస్తున్నాయి. తద్వారా భారీగా డ‌బ్బులు ఆదా చేసుకోవచ్చు. మరి ఈ సేల్ ఎప్పుడు ప్రారంభం కాబోతుందో చూద్దామా.

అమెజాన్ గ్రేట్ ఇండియా ఫెస్టివల్ సేల్ సెప్టెంబర్ 23 నుంచి ప్రారంభంకాబోతుంది. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ టీవీలు, వాషింగ్ మెషీన్‌లు, ఫ్రిజ్‌లు, బట్టలు ఒక్కటేమిటీ చాలా వస్తువులు మంచి ఆఫర్‌లో ల‌భిస్తున్నాయి. ద‌స‌రా పండ‌గ సందర్భంగా అమెజాన్ వినియోగదారులకు తక్కువ ధరలకే అన్ని వస్తువులను అందుబాటులోకి తెచ్చింది. ఈ సేల్ నుంచి వస్తువులను ఎస్‌బీఐ డెబిట్‌, క్రెడిట్ కార్డు ఉప‌యోగించి కొనుగోలు చేయ‌డంతో మ‌రో ప‌ది శాతం డిస్కౌంట్ పొంద‌వ‌చ్చు. మీరు ఎస్‌బీఐ వినియోగాదారులు అయితే ఈ సేల్ మీకు డబుల్ బెనిఫిట్ అనమాట.

ఈ సేల్ లో అన్ని రకాల ఎలక్ట్రానిక్స్‌ పై 75 శాతం వరకు డిస్కౌంట్‌ ఉంది. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్‌ల‌ పై భారీ త‌గ్గింపులు ఉన్నాయి. ఈ స్మార్ట్ ఫోన్‌లు రూ.5,999 నుంచే మనకు అందుబాటులో ఉంటాయి. దాని ద్వారా మీరు మీ బ‌డ్జెట్ త‌గ్గ‌ట్టు ఫోన్‌ల‌ను కొనుగోలు చేయ‌వ‌చ్చు.

ఈ సేల్లో ప్రీ బుక్ ఆఫర్ కూడా ఉంది. తద్వారా వస్తువులను ముందుగానే బుక్ చేసుకునే అవ‌కాశం కూడా ఉంది. అమెజాన్ సేల్ ప్రారంభం అవుతుంది అంటే చాలు ఫ్యాష‌న్ ప్రియుల‌కు పండ‌గే. అమెజాన్ సేల్ నుంచి 80 శాతం త‌గ్గింపుతో ఫ్యాష‌న్ ఉత్ప‌త్తుల‌ను కొనుగోలు చేయ‌వ‌చ్చు. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు ఆడవాళ్లకు మగవాళ్లు దుస్తులు, బ్రాండెడ్ కాస్మోటిక్స్ అన్నీ తక్కువ ధరలలో మనం కొనుగోలు చెయ్యవచ్చు.

ఇంటి కోసం వ‌స్తువుల‌ను కొనాలంటే ఈ సేల్ మీకు స‌రైన స‌మ‌యం. మీ ఇంటిని మ‌రింత ఆక‌ర్ష‌ణీయంగా మార్చే డెక‌రేటివ్ వ‌స్తువులు, వంటగదిని ఆక‌ర్ష‌ణీయంగా మార్చే కిచెన్ గ్యాడ్జెట్స్ మరియు వంట సామాగ్రి మొదలైన అన్ని వ‌స్తువుల‌పై 60 శాతం తగ్గింపుతో ల‌భిస్తున్నాయి.

ఇదీ చదవండి: 5G Smart Phones: 5జీకి క్రేజ్ ఎక్కువ..!

Exit mobile version
Skip to toolbar