Site icon Prime9

McKinsey Layoffs: మెకిన్సీలో 2వేల మందికి ఉద్వాసన.. కొనసాగుతున్న తొలగింపులు

mckinsey 1

mckinsey 1

McKinsey Layoffs: ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం కారణంగా టెక్ కంపెనీల్లో ఏరోజు ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి నెలకింది. ఇప్పటికే దిగ్గజ కంపెనీలు ఆర్థిక సంక్షోభాన్ని తట్టుకోవడానికి భారీగా ఉద్యోగాల కోతను చేపట్టాయి. ఇప్పటికే పలు కంపెనీలు తమ ఉద్యోగులను తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నాయి. తాజాగా మెకిన్సీ సైతం తమ ఉద్యోగులకు తగ్గించే యోచనలో ఉంది.

2వేల ఉద్యోగుల తొలగింపు.. (McKinsey Layoffs)

ఆర్ధికమాంద్యం ముంగిట పలు కంపెనీలు తమ ఉద్యోగుల సంఖ్యను తగ్గిస్తున్నాయి. మెకిన్సీ అండ్‌ కంపెనీ సైతం తమ ఉద్యోగులను తగ్గించుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ కంపెనీ.. ఇతర కంపెనీల ఉద్యోగుల తొలగింపు ప్రణాళికను అందిస్తుంది. అలాంటిది అదే సంస్థ స్వయంగా తమ సిబ్బందిని తగ్గించుకునే యోచనలో ఉంది. దాదాపు 2వేల మందిని తొలగించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ఆ సంస్థ వర్గాలు తెలిపాయి. తమ సంస్థతో నేరుగా సంబంధం ఉండని సిబ్బందిని తొలగించే యోచనలో మెకిన్సీ ఉందని సమాచారం. గత పదేళ్లుగా కంపెనీలో ఉద్యోగుల సంఖ్య గణనీయంగా పెరిగిందని తెలిపింది. ఆర్థికంగా అనిశ్చితి కొనసాగుతున్న వేళ.. సిబ్బందిని పునర్‌ వ్యవస్థీకరించాలని యోచిస్తోంది. వచ్చే 2-3 వారాల్లో తొలగింపుల ప్రణాళిక ఉండనున్నట్లు సమాచారం.

భారీగా పెరిగిన ఉద్యోగుల సంఖ్య..

2012లో మెకిన్సీలో 17,000 మంది ఉద్యోగులు ఉండగా.. ఐదేళ్ల క్రితం నాటికి ఆ సంఖ్య 28,000కు చేరింది. ఇప్పుడు ఆ సంఖ్య 45,000 గా ఉన్నట్లు కంపెనీ తెలిపింది. అయితే క్లయింట్లతో పనిచేసే నిపుణుల నియామక ప్రక్రియ ఆగబోదని తెలిసింది. 2021లో కంపెనీ ఆదాయం 15 బిలియన్ డాలర్లు ఉంది. 2022 ఫలితాలను ఇంకా ప్రకటించాల్సి ఉంది. ఫైనాన్స్‌, టెక్నాలజీ, రిటైల్‌ అన్ని రంగాల్లోని కంపెనీలు ఉద్యోగులను క్రమంగా తగ్గించుకుంటున్నాయి. ఆర్థిక మాంద్యం నేపథ్యంలో ఈ చర్యలు చేపడుతున్నాయి. టెక్‌ రంగంలో తొలగింపులు అధికంగా ఉన్నాయి.

టెక్ కంపెనీల్లో ఉద్యోగాల ఊచకోత కొనసాగుతూనే ఉంది. తాజాగా ప్రముఖ కంపెనీ యాహూ తమ ఉద్యోగులను తగ్గించిన విషయం తెలిసిందే. సంస్థలోని 1000 మంది ఉద్యోగులు లేఆఫ్స్ కు గురయ్యారు.
అంటే మొత్తం వర్క్ ఫోర్స్ లో దాదాపు 20 శాతం మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. ఇప్పటికే దిగ్జజ కంపెనీలు ఆర్థిక సంక్షోభాన్ని తట్టుకోవడానికి భారీగా ఉద్యోగాల కోతను చేపట్టాయి. స్ట్రీమింగ్ సబ్ స్కైబర్లు భారీగా తగ్గడంతో డిస్నీ సంచలన నిర్ణయం తీసుకుంది. సంస్థ లోని దాదాపు 7 వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపుతున్నట్టు ప్రకటించింది. టెక్ దిగ్గజం ‘డెల్’ లే ఆఫ్స్ ని ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా 6,650 మంది ఉద్యోగులను తొలగించింది. గూగుల్ మాతృసంస్ధ ఆల్ఫాబెట్ నుంచి గ్లోబల్ గా 12 వేల ఉద్యోగులను తొలగిస్తున్నట్టు ప్రకటించింది. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు కంపెనీ తెలిపింది. ఉద్యోగుల కోత సందర్భంగా కంపెనీ సీఈఓ సుందర్ పిచాయ్ బాధిత ఉద్యోగులకు ఈ మెయిల్ ద్వారా తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా తాజా పరిణామాలు, ఖర్చుల నియంత్రణ, ముదురుతున్న ఆర్థిక మాంద్యం తదితర కారణాలతో ఆల్పాబెట్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

Exit mobile version