Site icon Prime9

Diwali: దీపావళి సెలవు తేదీ మార్పు.. తెలంగాణ ప్రభుత్వం తాజా ఉత్తర్వులు

diwali holiday announcement by telangana

diwali holiday announcement by telangana

Diwali: తెలంగాణలోని విద్యార్థులకు అలర్ట్. దీపావళి సెలవు తేదీని మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ముందుగా అక్టోబర్ 25వ తేదీని దీపావళి సెలవు దినంగా ప్రకటించారు. అయితే తాజాగా ఆ సెలవును అక్టోబర్ 24న అంటే సోమవారానికి మార్చింది.

ఏ రోజు సెలవు అనే విషయంపై ప్రజల్లో నెలకొన్న గందరగోళం ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. పురోహితులు కూడా సోమవారమే దీపావళి అంటున్నారు. ఈ కారణంగా పండగ ఓ రోజు, సెలవు మరో రోజు వచ్చే పరిస్థితి ఉందంటూ రాష్ట్ర ప్రభుత్వానికి దీనిపై విజ్ఞప్తులు వెళ్లాయి. ఈ మేరకు తాజాగా తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.  దీపావళి సెలవును 24వ తేదీ సోమవారం అని కన్ఫామ్ చేసింది. దీనితో విద్యార్థులకు వరుసగా ఆదివారం, సోమవారం సెలవు దినాలుగా కానున్నాయి.

ఈ ఏడాది పండుగల తేదీల విషయంలో కొన్ని సందేహాలు నెలకొన్నాయి. కొన్ని ప్రాంతాల్లో దీపావళి అక్టోబర్ 24వ తేదీ అంటే, మరికొన్ని ప్రాంతాల్లో 25వ తేదీన దీపావళి అని ప్రచారం జరుగుతోంది. అయితే ఇదే రోజున ఈ ఏడాది సూర్యగ్రహణం కూడా సంభవిస్తోందని పలు దేవాలయాలను మూసివేస్తున్నారు.

ఇదీ చదవండి: దీపావళికి ఈ 4 లక్ష్మీ ఆలయాలను సందర్శిస్తే సిరిసంపదలు మీ సొంతం

Exit mobile version