Site icon Prime9

IND vs SA: భారత్ దూకుడుకు బ్రేక్.. 5 వికెట్ల తేడాతో సఫారీల గెలుపు

south africa won the match against team india in t20 wold cup 2022

south africa won the match against team india in t20 wold cup 2022

IND vs SA: పెర్త్ వేదికగా టీమిండియా, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన అమీతుమీ మ్యాచ్ లో ఎట్టకేలకు సఫారీ జట్టు గెలుపొందింది. టీ20 వరల్డ్‌కప్‌లో వరుస విజయాలతో మంచి జోష్‌ మీద ఉన్న టీమిండియా దూకుడుకు సఫారీ జట్టు బ్రేక్‌ వేసింది. ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు ఓటమి పాలైంది. ఆద్యంతం ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో సఫారీలు గెలుపొందారు. ఈ గెలుపుతో భారత్‌ను వెనక్కి నెట్టి ఐదు పాయింట్లతో గ్రూప్‌-2లో అగ్రస్థానానికి చేరుకుంది దక్షిణాఫ్రికా జట్టు.

భారత జట్టు నిర్దేశించిన 134 పరుగుల‌ను చేధించేందుకు బరిలోకి దిగిన సఫారీలు మ్యాచ్ ఆరంభంలో కాస్త తడపడ్డారు. ఓపెనర్లుగా దిగిన క్వింటెన్ డికాక్‌, బావుమా పెద్దగా రాణించలేకపోయారు. క్వింటెన్‌ డికాక్‌ (1), బవుమా (10), రుస్సో (0) పరుగులను మాత్రమే నమోదు చేసి పెవిలియన్ చేరారు. ఆ తర్వాత క్రీజులోకి ఎంట్రీ ఇచ్చిన మర్‌క్రమ్‌ హాఫ్‌సెంచరీతో రాణించాడు. డేవిడ్‌ మిల్లర్‌ (51) భాగస్వామ్యంలో జట్టుకు 85 పరుగుల భారీ స్కోర్‌ను అందించాడు. ఇద్దరూ చెరో హాఫ్‌ సెంచరీలతో మైదానంలో చెలరేగారు. ఫలితంగా టీమిండియా ఇచ్చిన 134 పరుగుల లక్ష్యాన్ని చేధించి విజయాన్ని అందుకున్నారు.

ఇదీ చదవండి: నేను డ్రగ్స్ కు బానిసను.. వసీం అక్బర్

Exit mobile version