Site icon Prime9

YouTube: జూన్‌ 26 నుంచి ఆ యూట్యూబ్ ఫీచర్ ఆగిపోనుంది

YouTube

YouTube

YouTube: ప్రముఖ వీడియో స్ట్రీమింగ్‌ దిగ్గజం యూట్యూబ్‌ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. యూట్యూబ్‌లో స్టోరీస్‌ ఫీచర్‌ ఆప్షన్‌ను తొలగిస్తున్నట్టు ప్రకటించింది. ఈ ఫీచర్ జూన్ 26 నుంచి అమలు లోకి రానుంది. దీంతో నిర్ధేశించిన గడువు తర్వాత వారం రోజుల వ్యవధిలో అప్పటికే క్రియేటర్‌లు షేర్‌ చేసిన స్టోరీస్‌లోని పోస్ట్‌లు కనిపించకుండా పోతాయి.

 

పెద్దగా పట్టించుకోని యూజర్లు(YouTube)

2017లో యూట్యూబ్‌ 10 వేల మంది సబ్‌స్కైబర్లు ఉన్న యూజర్ల కోసం స్టోరీస్‌ అనే ఫీచర్‌ను అందించడం మొదలుపెట్టింది. ఆ ఫీచర్‌తో యూట్యూబ్‌ క్రియేటర్లు వాళ్ల కంటెంట్‌ను ప్రమోట్‌ చేసుకునేందుకు ఉపయోగపడేది. కానీ యూట్యూబ్‌ ఊహించిన స‍్థాయిలో క్రియేటర్లు స్టోరీస్‌ని వినియోగించేందుకు మక్కువ చూపలేదు. ముఖ్యంగా, వినియోగంలో పరిమితి ఉండడంతో ఈ ఫీచర్ ను పెద్దగా పట్టించుకోలేదు. అందుకే యూట్యూబ్‌ ఈ నిర్ణయం తీసుకుందని పలు నివేదికలు వివరించాయి.

 

ఆ రెండు ఫీచర్లలో

యూట్యూబ్‌ నిర్వాహకులు అప్‌లోడ్‌ చేస‍్తున్న కంటెంట్‌ను ప్రమోట్‌ చేసుకునేందుకు స్టోరీస్‌కు బదులు కమ్యూనిటీ పోస్ట్‌లు, షార్ట్స్‌లు వినియోగిస్తున్నారు. యూజర్లను కంటెంట్‌తో ఎంగేజ్‌ చేసేలా ఉన్న ఆ రెండు ఫీచర్లలో టెక్ట్స్‌తో పాటు, పోల్‌లు, క్విజ్‌లు, ఫోటోలు, వీడియోలు షేర్‌ చేసే అవకాశం ఉంది. ఇన్ని సౌకర్యాలు ఉండడంతో స్టోరీస్‌ ఫీచర్‌ను పెద్దగా పట్టించుకోవడం లేదు.

 

Exit mobile version