Site icon Prime9

Jio True 5G: శరవేగంగా జియో 5జీ సేవలు.. ఆంధ్రప్రదేశ్ లో మరో రెండు నగరాల్లో..

Jio True 5G

Jio True 5G

Jio True 5G: ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో 5జీ సేవల్ని వేగంగా విస్తరిస్తోంది. తాజాగా దేశవ్యాప్తంగా జియో మరో 10 నగరాల్లో తన ట్రూ 5జీ సేవలను ప్రారంభించింది. అందులో ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి, నెల్లూరు నగరాలతో పాటు యూపీలోని ఆగ్రా, కాన్పూర్, మీరట్, ప్రయాగ్‌రాజ్, కోజికోడ్, త్రిసూర్, నాగ్‌పూర్ , అహ్మద్‌నగర్ లు ఉన్నాయి. ఏపీలో ఇప్పటికే వైజాగ్. గుంటూరు, విజయవాడ, తిరుమల లో జియో ట్రూ 5జీ సేవలు అందుబాటులో ఉన్నాయి.

భారీగా పెట్టుబడులు

జియో సంస్థ ఏపీలో భారీగా పెట్టుబడులు పెట్టింది. నెట్ వర్క్ కోసం ఇప్పటికే రూ. 26,000 కోట్లు పెట్టుబడి పెట్టగా.. 5జీ నెట్ వర్క్ ను ఏర్పాటు చేయడానికి మరో రూ. 6, 500 కోట్లకు పైగా అదనంగా ఇన్ వెస్ట్ చేసింది. ఈ ఏడాది చివరికి ఏపీలోని ప్రతి నగరం, మండలం, గ్రామాల్లో జియో ట్రూ 5జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి.

అపరిమిత డేటాతో వెల్ కమ్ ఆఫర్

ఇక ఈ నగరాల్లో జియో వినియోగదారులకు ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా 1 జీపీఎస్ ప్లస్ వేగంతో అపరిమిత డేటా పొందేలా జియో వెల్ కమ్ ఆఫర్ ను ప్రకటించింది. కొత్తగా ఈ ట్రూ 5జీ సేవలు ప్రారంభించిన నగరాలు పర్యాటక, వాణిజ్య రంగాలతో పాటు కీలక విద్యా కేంద్రాలని జియో ప్రతినిధి తెలిపారు. నాలుగు రాష్ట్రాల్లోని ఈ 10 నగరాల్లో జియో ట్రూ 5జీ సేవలను అందించడం ఎంతో గర్వకారణమన్నారు. కొత్త ఏడాది 2023 లో ప్రతి జియో వినియోగదారుడికి ఈ 5 జీ ప్రయోజనాలను అందించాలను భావిస్తున్నట్టు తెలిపారు. కాబట్టి దేశవ్యాప్తంగా 5జీ రోల్అవుట్ సామర్థ్యాన్నిపెంచుతున్నట్టు ప్రకటించారు.

5జీ సేవలు ఉన్న ప్రతి ప్రాంతంలోని వినియోగదారులు ఉత్తమ టెలికమ్యూనికేషన్ నెట్ వర్క్ ను పొందుతారని సంస్థ వెల్లడించింది. జియో ట్రూ 5 జీ సేవలు పొందాలంటే కస్టమర్లు 5 జీ మొబైల్ , సిమ్ కార్డు మార్చాల్సిన అవసరం లేదు. ఆటో మేటిక్ గా సర్వీస్ అప్ గ్రేడ్ అవుతుంది. తాము ప్రారంభిన ఈ సేవల ద్వారా దేశంలో హెల్త్ కేర్, స్కిల్ డెవెలప్ మెంట్, ఎడ్యుకేషన్, అగ్రికల్చర్ వంటి అనేక రంగాలు మరింత వృద్ధి సాధిస్తాయని జియో ఆశాభావం వ్యక్తం చేసింది.

5జీ లోనూ జియో టాప్

ప్రస్తుతం జియో 5జీ సేవలు పొందుతున్న నగరాల సంఖ్య మొత్తం 85కి చేరింది. దీంతో రిలయన్స్ జియో అత్యధికంగా 5 జీ సేవలు అందించే ఆపరేటర్ ఎదిగింది. ఇంతకుముందు ఎయిర్ టెల్ అగ్రస్థానంలో ఉండగా.. తాజాగా జియో అగ్రస్ధానంలో నిలిచింది. 4జీ సేవలను అందించడంలో కూడా జియో తన ఆధిపత్యాన్ని కొనసాగించిన విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి:

ఖమ్మంలో ఊహించని ట్విస్ట్‌లు.. ఫిక్స్ అయిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. పోతే పోనియండన్న కేసీఆర్

హైదరాబాద్‌లో పిల్లిని ఎత్తుకుపోతున్న దొంగ.. CCTV ఫుటేజ్ వైరల్

బిగ్ సర్‌ప్రైజ్.. ఆస్కార్‌కు క్వాలిఫై అయిన “కాంతారా”

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/@Prime9News
https://www.youtube.com/Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: http://Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

Exit mobile version
Skip to toolbar