Site icon Prime9

Realme Narzo N55: ఐఫోన్ ఫీచరతో వచ్చిన రియల్ మీ కొత్త స్మార్ట్ ఫోన్

Realme Narzo N55

Realme Narzo N55

Realme Narzo N55: ఎప్పటికప్పుడు అప్ డేట్ అవుతూ.. సరికొత్త ఫీచర్లతో కొత్త ఫోన్లను అందుబాటులోని తెస్తోంది చైనా దిగ్గజ మొబైల్ ఫోన్ కంపెనీ రియల్ మీ. తాజాగా ఈ కంపెనీ మరో మొబైల్ మార్కెట్ లో రిలీజ్ అయింది. రియల్ మీ నార్జ్ N55 పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్ ను తీసుకొచ్చింది. రియల్ మీ నార్జ్ కింద ఎన్ సిరీస్ లో వచ్చిన మొదటి స్మార్ట్ ఫోన్ ఇది. 33 వాట్స్ ఛార్జింగ్ సపోర్ట్ తో పాటు 64 మెగా పిక్సెల్ ఏఐ కెమెరా సిస్టమ్ తో ఈ సెగ్మెంట్ లో మొదటి స్మార్ట్ ఫోన్ కూడా ఇదే. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ. 10,999 కాగా రిలీజ్ ఆఫర్ కింద రూ. 1000 డిస్కౌంట్ అందిస్తున్నట్టు కంపెనీ ప్రకటించింది. ఈ ఫోన్‌లో మరో ప్రత్యేకత ఏంటంటే.. ఐఫోన్ 14 ప్రోలో ఉన్న డైనమిక్ ఐలాండ్‌ ఫీచర్‌ను రియల్ మీ తీసుకొచ్చింది.

 

రియల్ మీ నార్జ్ N55 స్పెసిఫికేషన్స్(Realme Narzo N55)

ఈ ఫోన్ లో ఆండ్రాయిడ్‌ 13 ఓఎస్‌, హిలియో జీ88 ప్రాసెసర్‌ను అమర్చారు. 6.72 ఇంచుల హెచ్‌డీ+ డిస్‌ప్లే, 90Hz రీఫ్రెష్‌ రేట్‌తో ఈ ఫోన్ వస్తోంది. 5,000mAh బ్యాటరీ సామర్థ్యంతో అందుబాటులోకి వచ్చింది. 33W ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది. అంటే 29 నిమిషాల్లో 50 శాతం ఛార్జింగ్‌ అవుతుంది. బ్లాక్, బ్లూ కలర్స్ ఈ స్మార్ట్‌ఫోన్‌ లభిస్తోంది. బ్లాక్ అండ్ వైట్ లెన్స్ 2 ఎంపీ మోనోక్రోమ్ సెన్సార్ తో వనక వైపు 64 ఎంపీ ప్రైమరీ కెమెరా అమర్చారు. సెల్ఫీల, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 8 ఎంపీ కెమెరా ఇచ్చారు. ఫోటో గ్రఫీ ఎక్స్ పీరియన్స్ కోసం రియల్ మీ అనేక కెమెరా ఫీచర్లను అందిస్తోంది. ఏఐ కలర్ పొట్రెయిట్, స్టారీ మోడ్ , బొకే ఫ్లేర్ పొట్రేయిడ్ లాంటి ఫీచర్లు ఉన్నాయి. అదనపు స్టోరేజ్‌ కోసం మైక్రో ఎస్‌డీ కార్డ్‌ స్లాట్‌, సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ ప్రింట్‌ స్కానర్‌ ని కూడా అందిస్తోంది.

 

 

ధర ఎంతంటే..

కాగా ఈ ఫోన్ రెండు వేరియంట్లతో అందుబాటులోకి రానుంది. 4జీబీ+64 జీబీ స్టోరేజ్‌ తో వచ్చే వేరియంట్‌ ధర రూ. 10,999 గా కంపెనీ తెలిపింది. 6జీబీ+128 జీబీ స్టోరేజ్‌ తో వచ్చే వేరియంట్‌ ధర రూ. 12,999 గా రియల్‌మీ నిర్ణయించింది. అమెజాన్‌, రియల్‌మీ వెబ్‌సైట్లలో ఏప్రిల్‌ 18 నుంచి ఈ ఫోన్ విక్రయాలు ప్రారంభం అవుతాయి. ప్రారంభ ఆఫర్‌ కింద బేస్‌ వేరియంట్‌పై రూ. 700, 6 జీబీ వేరియంట్‌పై రూ. 1000 చొప్పున డిస్కౌంట్‌ లభిస్తుంది. ఈ ఆఫర్లు ఏప్రిల్ 21 వరకే వర్తిస్తాయి.

 

Exit mobile version