Site icon Prime9

Apple iPhone: ఆ ఐఫోన్ మోడళ్లను నిలిపి వేయనున్న యాపిల్

Apple iPhone

Apple iPhone

Apple iPhone: ప్రముఖ ఇంటర్నేషనల్ సంస్థ యాపిల్ ఏదైనా కొత్త సిరీస్ లను ప్రారంభించేటప్పుడు .. పాత ఐఫోన్ మోడళ్లలో కొన్నింటిని నిలిపి వేయడం సంస్థకు అలవాటు. అయితే ఈ ఏడాది చివరల్లో యాపిల్ కంపెనీ ఐఫోన్ 15 ను తీసుకురానుంది. కొత్త సిరీస్ పై ఐఫోన్ ప్రియుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఈ క్రమంలో ఈసారి కూడా కొన్ని పాత మోడళ్లను యాపిల్ డిస్ కంటిన్యూ అవకాశం ఉన్నట్టు కన్పిస్తోంది.

ఐఫోన్‌ 14 ప్రో , ఐఫోన్‌ 14 ప్రో మ్యాక్స్‌ లూ..(Apple iPhone)

మార్కెట్ లోకి ఐఫోన్‌ 15 సిరీస్‌ రిలీజ్ అయిన తర్వాత ఐఫోన్‌ 14 ప్రో , ఐఫోన్‌14 ప్రో మ్యాక్స్‌ , ఐఫోన్‌ 13 మిని తో పాటు ఐఫోన్‌ 12 లను కంపెనీ నిలిపివేయనున్నట్టు తెలుస్తోంది. ఇందులో ఐఫోన్ 12 డిస్ కంటిన్యూ చేయడం మాత్రం ఖాయంగా తెలుస్తోంది. ఎందుకంటే యాపిల్ కంపెనీ ఏ మోడల్‌ నైనా మూడేళ్లకు మించి అందుబాటులో ఉంచదు. ఐఫోన్‌ 12 మోడల్‌ నిలిచిపోతే దాని స్థానాన్ని ఐఫోన్‌ 13 రిప్లేస్ చేస్తుంది.

 

ఐఫోన్ 15 లో 4  మోడళ్లు

సాధారణంగా యాపిల్ కంపెనీ ఒక ఏడాది అమ్మకాల తర్వాత దాని ప్రో మోడల్ ను నిలిపివేస్తుంది. ఈ నేపథ్యంలో ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మాక్స్ కూడా ఆగిపోయే అవకాశం ఉన్నట్టు సమాచారం. కానీ ఐఫోన్ 14 మాత్రం కొనసాగే అవకాశం ఉంది. దీని ధరను కూడా తగ్గించవచ్చు. రెండేళ్ల అమ్మకాల తర్వాత యాపిల్ ఐఫోన్ 12 మినీని ఆపేసింది. ఈ నేపథ్యంలో ఐఫోన్‌ 13 మినీని కూడా డిస్ కంటిన్యూ చేయవచ్చని నివేదిక సూచిస్తోంది.

అయితే యాపిల్ ఐఫోన్ 14 ప్లస్ మోడల్‌ పరిస్థితి మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. మార్కెట్ లో కొనసాగిస్తుందా.. నిలిపేస్తుందా అన్నది చెప్పడం కష్టం. కాగా ఐఫోన్‌ 15 సిరీస్ లో నాలుగు మోడళ్లను లాంచ్ చేస్తుందని తెలుస్తోంది. బేస్ ఐఫోన్‌ 15 తో పాటు ఐఫోన్‌ 15 Plus, ఐఫోన్‌ 15 ప్రో, ఐఫోన్‌ 15 ప్రో మ్యాక్స్‌ ఉంటాయని సమాచారం. మొదటి రెండింట్లో ఏ16 బయెనిక్ చిప్ సెట్ .. చివరి రెండింట్లో ఏ 17 ప్రాసెసర్ ఉంటుందని తెలుస్తోంది. వీటిని త్వరలో జరగబోయే డబ్ల్యూడబ్ల్యూడీసీ ఈవెంట్‌లో ప్రకటించే అవకాశం ఉంది.

 

 

Exit mobile version