Site icon Prime9

Airtel Standby Plans: జియోకు పోటీగా భారతీ ఎయిర్‌టెల్‌ స్కెచ్ 

Airtel Standby Plans

Airtel Standby Plans

Airtel Standby Plans: వినియోగ దారుల కోసం ప్రముఖ టెలికాం కంపెనీ భారతీ ఎయిర్‌టెల్‌ తక్కువ ధరలో రెండు కొత్త బ్రాడ్‌ బ్యాండ్‌ ప్లాన్లను ప్రారంభించింది. ‘బ్రాడ్‌ బ్యాండ్‌ స్టాండ్‌ బై ప్లాన్స్’ పేరుతో వీటిని తీసుకొచ్చింది. వీటి కింద ఒక ప్లాన్‌ ధరను రూ. 199 కే అందిస్తోంది. అదే విధంగా మరో ప్లాన్‌ ధరను రూ. 399 గా కంపెనీ నిర్ణయించింది. మార్చి నెలలో బ్యాకప్‌ ప్లాన్‌ పేరిట రూ. 198 కే జియో బ్రాడ్‌ బ్యాండ్‌ ప్లాన్‌ను తీసుకొచ్చింది. అయితే, తాజాగా ఎయిర్‌టెల్‌ ఈ ప్లాన్లను జియోకు పోటీగానే తీసుకొచ్చిందనేది స్పష్టంగా తెలుస్తోంది.

 

ఎయిర్ టెల్ ప్లాన్స్ ఎలా ఉన్నాయంటే..(Airtel Standby Plans)

ఎయిర్‌టెల్‌ తీసుకొచ్చిన నూతన బ్రాడ్‌బ్యాండ్‌ ప్లాన్లలో 10 MBPS స్పీడ్ వస్తుంది. రౌటర్‌ ను కూడా ఉచితంగా అందిస్తారు. రూ. 199 ప్లాన్‌ కింద 5 నెలల చందాను ఒకేసారి చెల్లించాల్సి ఉంటుంది. ఇన్‌స్టాలేషన్‌ రుసుము రూ. 500 తో కలుపుకొని రూ. 1674 ను ఒకేసారి చెల్లించాలి.

ఇక రూ. 399 ప్లాన్‌లో కూడా 10 MBPS వేగంతో ఇంటర్నెట్‌ లభిస్తుంది. ఈ ప్లాన్‌లో కూడా ఉచిత రౌటర్‌ ఇస్తారు. వీటితో పాటు అదనంగా ఎక్స్‌ట్రీమ్‌ బాక్స్‌, 350 ఛానెళ్లు ఉచితంగా వస్తాయి. ఇన్‌స్టాలేషన్‌ ఛార్జీ, 5 నెలల ప్లాన్‌ ధరతో కలుపుకొని రూ. 3 వేలు ఒకేసారి చెల్లించాలి. వీటితో పాటు రూ. 499, రూ. 799, రూ. 999, రూ. 1498, రూ. 3999 ధరల్లో వివిధ బ్రాడ్‌బ్యాండ్‌ ప్లాన్లను ఎయిర్ టెల్ అందిస్తోంది.

 

గత నెలలో జియో(Airtel Standby Plans)

కాగా, అంతకు ముందు రిలయన్స్ జియో మార్చి నెల లో రూ. 198 కే బ్యాకప్‌ ప్లాన్‌ను వినియోగదారుల కోసం ప్రారంభించింది. ఈ ప్లాన్‌ కింద యూజర్లు 10 MBPS వేగంతో ఇంటర్నెట్‌ సేవలు పొందొచ్చు. ఈ ప్లాన్‌ తీసుకున్న యూజర్లు అదనంగా రూ. 21 నుంచి రూ. 152 చెల్లించి ఒక రోజు నుంచి 7 రోజులు ఇంటర్నెట్‌ స్పీడ్ ను 30 ఎంబీపీఎస్‌ నుంచి 100 ఎంబీపీఎస్‌ వరకు పెంచుకునేందుకు వీలు ఉంటుంది. జియోలో కూడా 5 నెలల చందా ఒకేసారి చెల్లించాల్సి ఉంటుంది. ప్లాన్‌ను అప్‌గ్రేడ్‌ చేసుకుంటే టీవీ, ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌ కూడా పొందొచ్చు.

 

 

 

Exit mobile version