Prime9

TDP: టీడీపీకి ఎదురుదెబ్బ.. పార్టీకి సీనియర్ నేత రాజీనామా

Senior Leader Resigned: అన్నమయ్య జిల్లాలో అధికార టీడీపీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. రాజంపేట నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి, సీనియర్ నేత సుగవాసి సుబ్రహ్మాణ్యం పార్టీకి రాజీనామా చేశారు. కాగా 2024 ఎన్నికల్లో సుబ్రహ్మణ్యం టీడీపీ తరపున పోటీచేసి ఓడిపోయారు. కాగా రాజీనామా లేఖను పార్టీ అధినేత, సీఎం చంద్రబాబుకు పంపారు. “ప్రజల సలహాలను, సూచనలను, అభిప్రాయాలను, మనోభావాలను గౌరవిస్తూ నేను తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్నాను”. అని లేఖలో పేర్కొన్నారు. ఇంతకాలం పార్టీలో తనకు సహాకారం అందించినందుకు అధినేతకు, పార్టీ నేతలకు ధన్యవాదాలు చెప్పారు.

 

అయితే గత ఎన్నికల్లో సొంత పార్టీ నేతలే సుబ్రహ్మాణ్యంను ఓడించారని, టీడీపీలోనే.. వైసీపీ కోవర్టులు ఉన్నారని సంచలన ఆరోపణలు చేశారు. తమకు పార్టీ ముఖ్యం కాదని, కార్యకర్తలే తమకు బలం అని సుబ్రహ్మాణ్యం సోదరుడు ప్రసాద్ బాబు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో తప్పకుండా రాయచోటి నుంచి పోటీ చేసి తీరుతామని స్పష్టం చేశారు. ఏ పార్టీ మద్దతు లేకున్నా ఎన్నికల్లో పోటీ చేస్తామని, జీవితాంతం ప్రజా సేవ చేస్తామని పేర్కొన్నారు.

 

Exit mobile version
Skip to toolbar