Prime9

Deputy CM Pawan Kalyan: బెంగళూరుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌.. ఏపీకి ఆరు కుంకీ ఏనుగులు!

Deputy CM Pawan Kalyan to Attend Ceremonial Handover of Kumkis to AP: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ ఇవాళ కర్ణాటక రాష్ట్రానికి వెళ్లనున్నారు. ఈ మేరకు బెంగళూరులో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డీకేలను పవన్ కల్యాణ్ కలవనున్నారు. ఏపీ రాష్ట్రానికి కుంకీ ఏనుగులను రప్పించే కార్యక్రమానికి ఆయన హాజరవుతున్నారు. మొత్తం రాష్ట్రానికి ఆరు కుంకీ ఏనుగులను కర్ణాటక ప్రభుత్వం అప్పగించనుంది.

 

కాగా, కుంకీ ఏనుగులు ఇవ్వాలని గతంలో కర్ణాటక ప్రభుత్వాన్ని పవన్ కల్యాణ్ కోరారు. అడవి ఏనుగుల దాడులతో పలు జిల్లాల్లో ప్రాణ, పంట నష్టం జరిగింది. ఈ మేరకు రైతుల పంటలతో పాటు స్థానికంగా ఉన్న గ్రామీణ ప్రజలకు కలుగుతున్న నష్టాన్ని వివరించారు. ఈ ఇబ్బందులను నివారించడానికి కూటమి ప్రభుత్వం ముందడుగు వేసింది.

 

ఇందులో భాగంగానే ఏనుగుల గుంపు సమస్యకు కుంకీ ఏనుగులతోనే పరిష్కారం లభిస్తుందని ప్రభుత్వం భావించింది. ఈ మేరకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన కృషి ఫలించింది. ఫలితంగా కర్ణాటకలో శిక్షణ పొందిన కుంకీ ఏనుగులను‌ అధికారికంగా కర్ణాటక ప్రభుత్వం ఏపీకి అప్పగించనుంది. కాగా, అంతకుముందు గత సెప్టెంబర్‌లోనే ఏనుగుల అప్పగింతకు ఒప్పందం కుదిరినట్లు పవన్ కల్యాణ్ వెల్లడించారు.

Exit mobile version
Skip to toolbar