Madya Pradesh Viral News: జనాల రోజురోజుకు తెలివిమీరిపోతున్నారు. మార్కెట్ కు తగ్గట్లు బిజినెస్ చేస్తూ మంచి లాభాలను ఆర్జిస్తున్నారు. అయితే ప్రస్తుతం మార్కెట్లో ట్రెండింగ్ ఉన్న వస్తువులు ఏమైనా ఉన్నాయా అంటే అది టమాటా అనే చెప్పుకోవాలి. నిన్నామొన్నటి వరకూ రూ. 20 లేదా రూ.30 ఉండే టమాటా ఇప్పుడు అమాంతం ఆకాశాన్నంటింది. ప్రస్తుతం మార్కెట్ లో టమోటా ధరలు మండిపోతున్నాయి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.200 ల దాగా ధర పలుకుతుంది. కొన్ని మరిచోట్ల అయితే రూ. 250కి కూడా చేరువుతోంది. దీంతో ప్రజలు టమాట అంటేనే భయపడే పరిస్థితి వచ్చింది.
స్మార్ట్ ఫోన్ కు టమాటాలు ఫ్రీ(Madya Pradesh Viral News)
సామాన్యులకు అందనంత ఎత్తులో టమాట ధరలు వెళ్లి కూర్చున్నాయి. ఒక్క టమోటా మాత్రమే కాదు కొన్ని ప్రాంతాల్లో ఉల్లి, పచ్చిమిర్చి ఇలా అన్నీ కూరగాయలు అలానే ఉన్నాయి. ఇలాంటి తరుణంలో ఓ షాపు యజమాని అదిరిపోయే బంఫర్ ఆఫర్ ను ప్రకటించారు. అదేంటంటే.. తన షాపులో స్మార్ట్ ఫోన్ కొంటె రెండు కేజీల టమోటాలు ఫ్రీ అని ప్రకటించారు. దానితో ఆ షాపు ముందు జనాల్లో క్యూ కడుతున్నారు. దానితో అతని సేల్స్ విపరీతంగా పెరిగాయని దుకాణదారుడు చెప్పుకొచ్చారు. అలాగే ప్రజల నుంచి కూడా ఈ ఆఫర్ కు మంచి స్పందన లభిస్తోంది.
ఇంతకీ ఈ ఆపర్ మధ్యప్రదేశ్‌లోని అశోక్ నగర్‌లో అశోక్ అగర్వాల్ అనే యువకుడు మొబైల్ షాప్‌ను నిర్వాహకుడు ప్రకటించారు. మార్కెట్ ట్రెండ్ కు తగినట్టుగా పెరిగిన టమాట ధరలను తన షాప్ ప్రచారానికి వాడుకోవాలని భావించి.. అనుకున్నదే తడవుగా తన దుకాణంలో స్మార్ట్ ఫోన్ కొంటే 2 కిలోల టమాట ఫ్రీ అంటూ ఫ్లెక్సీ వేయించాడు. దీనితో స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనుకునే వారు అశోక్ దుకాణానికి క్యూ కట్టడం ప్రారంభించారు. ఈ ప్రకటన తర్వాత తన షాపులో అమ్మకాలు మునుపటికంటే పెరిగాయని చెప్పుకొచ్చాడు. మొత్తానికి అతని ప్లాన్ బాగా వర్కౌట్ అయ్యిందంటూ నెటిజన్లు చెబుతున్నారు.