Site icon Prime9

Viral Video: జలపాతం అందంగా ఉంది.. కానీ దీని వెనుక కథ మాత్రం ఏడ్పించేసింది!

waterfall prime9news

waterfall prime9news

Nohkalikai Falls: పర్యాటకులు వివిధ రకాల ప్రాంతాల్ని సందర్శించడానికి కొత్త కొత్త ప్రదేశాలను చూడటానికి వెళ్తుంటారు. అలానే ప్రతి సంవత్సరం ఎక్కువ మంది టూరిస్టులు మేఘాలయకి ప్రాంతానికి వెళ్తారు.

ఖాసీ భాషలో ‘కా’ అనేది స్త్రీ లింగాన్ని సూచిస్తు ఉంటుంది. లికై అనేది అది ఒక స్త్రీ పేరు. ఐతే స్థానిక పురాణాల ప్రకారం నోహ్కాలికై జలపాతానికి పైన మారుమూల ఒక చిన్న గ్రామం వుంది. అదే రంగ్జిర్తెహ్ గ్రామం. ఆ గ్రామంలో లికై అనే మహిళ ఉండేది. ఆమె భర్త చనిపోయాడు. ఆమె తన బిడ్డతో పాటు అక్కడే తన జీవనం సాగిస్తూ ఉంటుంది. తన బిడ్డను చూసుకోవడానికి ఆమెకు చాలా కష్టంగా ఉండేది. దాంతో ఆమె మరో వివాహం చేసుకున్న రెండో భర్త దుర్మార్గుడు. అతనికి మొదటి భర్త కూతురు అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు. ఒక రోజు భార్యకి తనే వంట చేసి పెట్టాడు. ఆ సమయంలో బిడ్డ ఆమెకు కనిపించ లేదు.

ఆ బిడ్డని చంపేసి భార్యకు వండి పెట్టిన ఆ రాక్షసుడు. మాంసం కూర తిన్న తరువాత తమలపాకులు, వక్క వేసుకునేటప్పుడు ఆమెకి ఇదంతా తెలిసిందట. లికై తమలపాకులు వేసుకునే చోటికి వెళ్ళాక అక్కడ ఒక చిన్న వేలు పడిపోయి ఉంటుంది. ఇది చూసి, ఆశ్చర్యపోయిన ఆమెకు అప్పుడు అసలు విషయం అర్థమైంది. ఆ తర్వాత ఆమె, ఒక చేతిలో గొడ్డలి పట్టుకొని ఊర్లో పరుగులు పెడుతూ చివరకు ఆమె జలపాతంలో పడిపోయినట్లు చెబుతారు. దాంతో ఆమె పేరు మీదనే ఈ జలపాతానికి నోహ్కాలికై అనే పేరు వచ్చింది.

Exit mobile version