Viral Video: బిహార్ రాష్ట్రంలో హనుమాన్ జయంతి వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. తులసీదాస్ రామాయణాన్ని చెప్తూనే ఓ రిటైర్డ్ ప్రొఫెసర్ అకస్మాతుగా అక్కడికక్కడే కుప్పకూలి మరణించారు.
బిహార్ రాష్ట్రం ఛాప్రా నగరంలోని మారుతీ మానస్ ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. కాగా వేడుకల్లో భాగంగా శనివారం సాయంత్రం ఆలయ ప్రధాన కార్యదర్శి, రిటైర్డ్ ప్రొఫెసర్ రణంజయ్‌సింగ్ అనే వ్యక్తి తులసీదాస్ రామాయణాన్ని భక్తులకు వినిపిస్తూ రాముడి గుణగణాలు చెప్తున్నారు. అప్పటి వరకూ ఎంతో శ్రద్ధగా రాముడి కథ చెప్తూ చెప్తూ ఉన్న రణంజయ్ సింగ్ ఏమైయిందో ఏమోగాని అకస్మాతుగా ఒక్కసారిగా గుండెపోటుకు గురయ్యాడు. దానితో చేతిలో మైక్ పట్టుకునే ఒక్కసారిగా వెనక్కి కుప్పకూలిపోయాడు. వెంటనే అక్కడే ఉన్న నిర్వహాకులు స్థానిక ఆసుపత్రికి ఆయనను తరలించారు. కాగా అప్పటికే రణంజయ్ సింగ్ చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
VIDEO: हनुमान जयंती पर मंच से दे रहे थे भाषण, अचानक आया हार्ट अटैक; रिटायर्ड प्रोफेसर की मौत pic.twitter.com/cX8ehsxvyh
— NDTV India (@ndtvindia) October 23, 2022
ఇదీ చదవండి: ఉపాధ్యాయుడిని చెప్పులతో కొట్టిన మహిళలు.. ఎందుకో తెలుసా..?