Site icon Prime9

Viral Video: ఏకంగా స్మార్ట్ ఫోనుకే టెండర్ పెట్టిన ఏనుగు

viral-video

viral-video

Elephant Mobile Viral Video: ప్రస్తుతం సోషల్ మీడియా వాడకం బాగా పెరిగిపోయింది. ఎంతలా అంటే ఫోనే ప్రపంచంలాగా, ఫోన్ లేకపోతే ఉండలేనంతగా చాలా మంది ఉంటున్నారు. మార్కెట్ దగ్గర నుంచి సినిమా టికెట్ వరకు ప్రతిదీ ఫోన్ లోనే ఐపోతుంది. ఎవరి చేతిలో చూసినా స్మార్ట్ ఫోన్సే ఎక్కువ కనపడుతున్నాయి. స్మార్ట్ ఫోన్ మీదే ప్రతి ఒక్కరూ ఆధారపడి ఉంటున్నారు. మనలో చాలా మంది స్మార్ట్ ఫోనులో ఎక్కువగా వాట్సాప్ ఫేస్‌బుక్ ఇన్‌స్టాగ్రామ్ వంటి వాటికి బాగా ఎడిక్ట్ అయిపోతున్నారు.

వీడియోలో ఏముందో ఇక్కడ తెలుసుకుందాం..
ఇన్‌స్టాగ్రామ్‌లో కేరళ ఎలిఫేంట్ అనే పేజీలో షేర్ చేసిన వీడియో తెగ వైరల్ అయ్యింది. దీన్ని గమనిస్తే, ఓ గుడిలో మావటి కూర్చొని ఉన్నాడు. ఆయన తన ఫోను చూసుకుంటున్నాడు. ఆయనంటే ఎంతో ప్రేమ కలిగివున్న ఓ గజరాజు పక్కనే నిల్చున్నాడు. తన యజమాని ఏం చేస్తున్నాడా అని గమనించిన ఏనుగు, తన ఫోనునే చూస్తూ ఉన్నది. స్మార్ట్ ఫోనులో ఫోటోలు మారుతూ ఉంటే ఆశ్చర్యపోయిన ఏనుగు. దాన్ని చూసేందుకు కిందకు వంగింది. అక్కడ కూడా చూడటానికి వీలు లేకపోయేసరికి ఎడ్జస్ట్ చేసుకుంటూ తను కూడా ఫోనును చూడటం మొదలుపెట్టింది. ఇది గమనించిన కొందరు, వాళ్ళ మొబైల్‌తో వీడియో రికార్డ్ చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

 

Exit mobile version