Site icon Prime9

Instagram: “నువ్వు నా భార్యవి అవుతావా” అంటూ 14 ఏళ్ల బాలుడి ఇన్ స్టా స్టేటస్

case-against-14-year-boy-for-his-instagram-status

case-against-14-year-boy-for-his-instagram-status

Instagram: స్మార్ట్ ఫోన్ల యుగంలో చిన్నాపెద్దా అందరూ చరవాణీలకు అలవాటైపోయారు. దానితో సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ బాలుడు పెట్టిన స్టేటస్ అతడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయడానికి కారణమైంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్రలోని పూణెలో ఓ పాఠశాలలో చదువుతున్న 14 ఏళ్ల విద్యార్థి, అదే పాఠశాలలో చదువుతున్న 13 ఏళ్ల బాలిక వెంటపడుతూ తనతో స్నేహం చేయాలని వేధించేవాడు. అంతేకాదు, తనతో ఫ్రెండ్‌షిప్ చేయకుంటే ఎత్తుకుపోతానని బెదిరించాడు.

అతడి బెదిరింపులను బాలిక ఖాతరు చెయ్యకపోవడం వల్ల ఆమెపై కోపం పెంచుకున్న బాలుడు ఆ చిన్నారి ఫొటో తీసి ఇన్ స్టా వేదికగా స్టేటస్‌గా పెట్టి
‘నువ్వు నా భార్యవి అవుతావా?’ అని రాసుకొచ్చాడు. అది చూసిన బాలిక జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. దానితో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు, బాలుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అతడిని అదుపులోకి తీసుకున్నారు.

ఇదీ చదవండి: ఇది బైక్ కాదు భయ్యో.. మినీ బస్

Exit mobile version