Site icon Prime9

Viral Vedio: డబ్బు ముఖ్యం కాదు భయ్యా.. ఈ వీడియో చూస్తే మీరు అదే చెప్తారు

A viral video of a poor girl's joy with a puppy

A viral video of a poor girl's joy with a puppy

Viral Vedio: మనీ మేక్స్ మెనీ థింగ్స్ అంటుటారు కానీ అన్నివేళలా ఈ నానుడి వర్తించదు. డబ్బుంటే ఆనందంగా ఉండవచ్చని చాలా మంది అనుకుంటుంటారు. కానీ ఎల్లప్పుడూ డబ్బే మనకు ఆనందాన్ని ఇవ్వదు అన్న విషయాన్ని గుర్తించరు. తమకున్న దానితో చాలా మంది నిరుపేదలు, మధ్యతరగతి వారు చాలా ఆనందంగా గడుపుతుంటారు. అన్నీ ఉండి కూడా ఎప్పుడూ బిజీబిజీ లైఫ్ తో క్షణం తీరికలేక గుప్పెడంత సంతోషం లభించక చాలా మంది కోటీశ్వరులు మనశ్శాంతి కోసం వెదుకుతుంటారు. ఇప్పుడు ఇంతా ఎందుకు చెప్తున్నానంటే నెట్టింట ఇప్పుడు ఓ వీడియో వైరల్ అవుతుంది. మరి అదేంటో చూసెయ్యండి.

ఓ డబ్బున్న వ్యక్తి సిగ్నల్ వద్ద కారు ఆపి ఉంటాడు. ఆ కారులో ఓ ఖరీదైన కుక్క కూడా ఉంటుంది. అయితే అటుగా నడుచుకుంటూ ఓ నిరుపేద చిన్నారి వెళ్తూ ఆ కారు వద్ద ఆగుతుంది. కారులోని ఆ కుక్కపిల్లను చూసి కారు గ్లాస్ వేసి ఉన్నాసరే గ్లాస్ ను తట్టి మరీ కుక్కపిల్లతో సైగల ద్వారా మాట్లాడుతూ దానిని ముద్దాడుతుంది. ఆ చిన్నారి చేష్టలతో ఎంతో ఆనందించిన కుక్కపిల్ల యజమాని కారు గ్లాస్ కిందకు దించుతాడు. దానితో ఆ చిన్నారి తెగ మురిసిపోతూ కుక్కపిల్ల తల నిమురుతూ దానితో ఎంతో సరదాగా ఆడుకుంటుంది. ఆ చిన్నారితో డాగ్ కూడా చాలా ఆనందంగా ఆడుకుంటుంది. ఈ సన్నివేశం మొత్తాన్ని ఓ వ్యక్తి వీడియో తీసి దానిని రాహుల్ అట్టారి అనే ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేశారు. ఎప్పుడూ డబ్బే ఆనందాన్ని ఇవ్వదు అంటూ ఈ వీడియోకు క్యాప్షన్ కూడా జోడించాడు. దీనిని ప్రస్తుతం నెటిజన్లు తెగ వైరల్ చేస్తున్నారు. దీన్ని చూసిన నెటిజన్లంతా నిజమే కదా డబ్బు ముఖ్యం కాదు ఆనందంగా ఉంటూ ఎదుటివారిని సంతోషపెట్టడమే మానవ జీవిత పరమార్ధం అని కామెంట్లు రాస్తున్నారు. అయితే ఈ ఘటన ఎక్కడ ఎప్పుడు జరిగింది అనేది తెలియరాలేదు.


ఇదీ చదవండి: జలపాతం అందంగా ఉంది.. కానీ దీని వెనుక కథ మాత్రం ఏడ్పించేసింది!

 

 

Exit mobile version