Pawan Kalyan: అమలు చేసే వ్యక్తి లేనపుడు ఎన్నిగొప్ప చట్టాలు చేసినా ఉపయోగం ఉండదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు.
మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులపై వైసీపీ సర్కార్ నిర్లక్ష్యంపై సదస్సు నిర్వహించారు.
ఈ సందర్బంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ శ్రీహరికోట కేంద్రం ఏర్పాటు చేసినపుడు యానాదులు రోడ్డున పడ్డారని చెప్పారు.
2006, 2007 లో దళిత చైతన్యంతో ఉన్న మేధావులు నాకు పరిచయం.
జై బీమ్ పదాన్ని నామనసులోకి ఎక్కించిన మాస్టర్జీ కు నేను రుణపడి ఉంటానని పవన్ కళ్యాణ్ అన్నారు.
వ్యక్తి ఆరాధన ఎంత మంచిదో అంత ప్రమాదం.
ఒక రాజ్యాంగబద్ధ పదవిని చేపట్టిన తరువాత నేను దేనికి సమాధానం చెప్పను అనే వ్యక్తులు అంబేద్కర్ ని అగౌవపరిచినట్టే అని ఆయన అన్నారు.
నేను దెబ్బలు తిని వచ్చా.. నిలబడ్డా.. మీకోసం నిలబడతా.. ఐ విల్ గివ్ యూ ఎంపర్మెంట్ అని దళితులకు పవన్ కళ్యాణ్(Pawan Kalyan) హామీ ఇచ్చారు.
అణగారిన వర్గాల అభ్యున్నతే తన ధ్యేయమని ఆయన పేర్కొన్నారు.
గంటసేపు నీళ్లివ్వలేదు..
తాను నెల్లూరులో ఉన్నపుడు ఓ రెల్లి సోదరుడు వచ్చి నేను మిమ్నల్ని కౌగలించుకోవచ్చా అని అడిగాడు.
దానికి నేను షాక్ అయ్యాను ఇలా కూడా ఆలోచిస్తారాని అని అనుకున్నాను అన్నారు.
దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు ఏ మేరకు అణగారిన వారిని ట్రీట్ చేస్తున్నారు ఈ సమాజం అని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.
ఒకసారి విదేశీ పర్యటనలో భాగంగా ఫ్లైట్ లో వెళ్లినపుడు నేను కూడా వివక్షకు గురయ్యాను..
నా రంగును చూసి తెల్లోల ఎయిర్ హోస్టెస్ గంటవరకూ నాకు మంచి నీళ్లు ఇవ్వలేదని ఆయన తెలిపారు.
ఆ తర్వాత తాను ఫ్లైట్ దిగి అక్కడి సిబ్బందితో మాట్లాడినప్పుడు తాను ఎంతటివారో తెలుసుకుని విమాన సిబ్బంది వైన్ బాటిల్స్ తీసుకువచ్చి ఇస్తామన్నారని కానీ తాను వాటిని తిరస్కరించారని పేర్కొన్నారు.
ఇంత మంది ఎస్సీ జనాభా ఉన్నా మాకు ఇంకా నిధులు ఇవ్వండని బ్రతిమాలడం బాధాకరం.
దీనికి అధికారంలో ఉన్న వారిని నిందించే ముందు మనలో ఉన్న లోపాలను గుర్తించాలి.
మన హక్కులను కాలరాసే వారిని ఎవరినైనా ఎదుర్కోవాలి.
నాయకత్వం అంటేనే నమ్మిన సిద్దాంతాలకు కట్టుబడి ఉండటం.. నేను మీవాడిని అని ఎపుడు చెప్పగలనంటే పనిచేసినపుడు చెప్పగలను అని పవన్ కళ్యాణ్ చెప్పారు.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/