Site icon Prime9

Viral Video : మెట్రో ట్రైన్ లో ” టవల్ ” కట్టుకొని హాల్ చల్ చేసిన యువకుడు

young-man-travels-only-with-towel-in-metro-and-video-goes-viral

young-man-travels-only-with-towel-in-metro-and-video-goes-viral

Viral Video :  ప్రస్తుత కాలంలో ఏది ఎందుకు ఫేమస్ అవుతుందో ఎవ్వరికీ అర్దం కావడం లేదు. ముఖ్యంగా సోషల్ మీడియా లో ఏదైనా ఫోటో లేదా ఏదైనా వీడియో మంచిగా అయిన, విచిత్రంగా అయిన కానీ ముందు వైరల్ గా అయితే మాత్రం మారుతుంది. ఈ తరుణంలోనే సదరు వీడియో లేదా ఫోటోలో ఉన్న వ్యక్తులు వెంటనే ఫేమస్ అవుతున్నారు. ముఖ్యంగా ఇటీవల కాలంలో సోషల్ మీడియా ద్వారా ఫేమస్ అయిన వారిని ఎక్కువగా గమనించవచ్చు. అయితే సోషల్ మీడియాలో వైరల్ అయ్యేందుకు కొందరు యువతీ, యువకులు ఏదో ఒకటి చేస్తూనే ఉంటున్నారు.

ఈ తరుణంలో కొంతమంది అయితే అసలు వారికి సిగ్గు ఉందా లేదా, ఎందుకు ఇలా తయారు అవుతున్నారు అంటూ చీదరించుకుంటున్న కూడా వారి పని వారు చేసుకుంటూ పోతున్నారు. ఈ క్రమం లోనే కొందరు హద్దులు దాటి మరి ప్రవర్తిస్తున్నారు. గతంలో హైదరాబాద్ మెట్రో రైల్‌లో ఓ యువతి డ్యాన్స్‌తో హల్‌చల్ చేసింది. దీంతో నిబంధనలకు విరుద్దంగా మెట్రో రైలులో డ్యాన్స్ చేసి ప్రయాణికులకు ఇబ్బంది కలిగించినందుకు మెట్రో యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇదే తరహాలో తాజాగా ఓ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఆ వీడియోలో ఓ యువకుడు టవల్, బన్నీపై మెట్రో రైలు ఎక్కి హల్ చల్ చేశాడు. రద్దీగా ఉన్న మెట్రో రైలు లోకి టవల్, బన్నీ మాత్రమే ధరించి ఎక్కడమే కాకుండా, అటూ ఇటూ తిరుగుతూ అద్దంలో చూస్తూ తలదువ్వుకుంటూ ఫోజులిచ్చాడు. దీంతో మెట్రోలో ప్రయాణిస్తున్న కొందరు యువతులు ఈ యువకుడి వేషధారణ చూసి నవ్వుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ పోస్ట్ లో … మా ట్యాంక్‌లో నీళ్లు ఖాళీ అయ్యాయి… ఈరోజు ఆఫీసులోనే స్నానం చేస్తా అని రాసుకొచ్చాడు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆసక్తికర కామెంట్లు చేస్తున్నారు. ఈ యువకుడి ఇంస్టా ఖాతాను పరిశీలిస్తే గతం లోనూ ఇలాంటి పలు వీడియో లు చేసినట్లు గమనించవచ్చు. ఫేమస్ అవ్వడం కోసం వీరు పడుతున్న పాట్లు చూస్తుంటే కొన్నిసార్లు ఏం చెప్పాలో తెలియడం లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Exit mobile version