Dharmavaram: తమ ఆలోచనలతో.. తమ సృజనాత్మకతతో ప్రపంచాన్ని మెప్పించే ఘనత ఉన్నది కేవలం చేనేత (Handloom) కార్మికులకు మాత్రమే.
ప్రపంచ మానవాళికి బట్టకట్టి నాగరికతను నేర్పిన చేనేత ఘనత నేతన్నలకు మాత్రమే చెందుతుంది.
ఎంతో నైపుణ్యం, సృజనాత్మకత ఉన్న ప్రస్తుత కాలంలో చేనేత కార్మికుల జీవితం కష్టంగా మారుతోంది.
కానీ ఆ పనిని ఇష్టంగా చేస్తూ.. విభిన్నంగా ఆలోచించవచ్చని చెబుతుంది సత్యసాయి జిల్లా ధర్మవరం కు చెందిన ఓ మహిళ.
ధర్మవరంలోని నాగరాజు వృత్తిరీత్యా చేనేత చైనేత కార్మికులు కార్మికుడు. పట్టుచీరలపై వచ్చే డిజైన్లను తయారు చేస్తుంటాడు.
ఇక సంక్రాంతి సందర్భంగా ప్రతి ఏడాది పట్టు చీరలపై వచ్చే డిజైన్లను రంగుల హరివిల్లుగా సంక్రాంతి ముగ్గులా పొందుపరచడం తమకు అలవాటని అంటున్నారు.
అందులో భాగంగానే ఈ ఏడాది కూడా పట్టుచీరనే సంక్రాంతి ముగ్గుగా తన భార్య చేత వేయించడం జరిగిందని ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా అతని భార్య జూజూరు సౌమ్య మాట్లాడుతూ తాము పుట్టింది పెరిగింది చేనేత కార్మికుల కుటుంబమే అని అన్నారు.
కాబట్టి ఏ పని చేసినా చేనేత రంగానికి ముడిపడే ఉంటుందని అందులో భాగంగానే సంక్రాంతి ముగ్గుగా చేనేత కార్మికుల తయారు చేసే పట్టుచీరను సంక్రాంతి ముగ్గుగా వేయడం జరిగిందని తెలిపారు.
మనం ఇష్టపడి చేసే పనిని మనకు నచ్చిన విధంగా మలచుకోవచ్చని సౌమ్య అన్నారు.
చిన్ననాటి నుంచి ఇదే రంగంలో ఉన్నానని.. ఈ పనిపై మక్కువతోనే పట్టుచీరనే ముగ్గుగా వేశానని తెలిపింది.
కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ఉంటే ఏదైనా చేయవచ్చని తెలిపింది. ఆర్థికంగా లాభం లేకపోయినా.. ఈ పని ఇచ్చే సంతృప్తి ముందు ఏదీ సాటిరాదంటూ సౌమ్య చెప్పుకొచ్చారు.
కొన్ని చేనేత కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కుకుంటే మరికొందరి పరిస్థితి దయనీయంగా మారింది. ఎన్నో రంగురంగుల చీరలను నేసిన నేతన్నలు.. తమ బతుకులకు మాత్రం రంగులద్దలేక పోతున్నారు. వస్త్ర ప్రపంచంలో ఎంత పురోగతి ఉన్నా.. నేతన్నలు తామేంటో నిరూపించుకుంటున్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో చేనేత రంగానికి చేయూత అందించాలని.. ప్రభుత్వం చేనేతల కుటుంబాలకు అండగా నిలవాలని పలువురు కోరుతున్నారు.
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/