Site icon Prime9

Man Sues Apple: విడాకులకు దారితీసిన ఐ-ఫోన్‌ మేసేజ్‌.. ఆపిల్ కంపెనీపై భర్త దావా..

Man Sues Apple

Man Sues Apple

Man Sues Apple: ప్రస్తుతం మొబైల్‌ ఫోన్‌ లేకుండా ఒక్క క్షణం కూడా గడవదు. అయితే ఈ మొబైల్‌ఫోన్లే సంసారాలను కూడా కూలుస్తాయనే విషయం తాజా ఎపిసోడ్‌ను చూస్తే తెలిసిపోతుంది. ఇక అసలు విషయానికి వస్తే బ్రిటన్‌కు చెందిన ఓ వ్యక్తి సెక్స్‌ వర్కర్స్‌తో తన ఐఫోన్‌ ద్వారా మేసేజ్‌ లు.. చాట్‌లు చేసి ఏంజాయ్‌ చేసేవాడు. అటు తర్వాత ఈ మేసేజ్‌లను, చాట్‌లను డెలిట్‌ చేసేవాడు. తను పంపిన మేసేజ్‌ డెలిట్‌ అయ్యాయి ఇక నో ప్రాబ్లం అనుకున్నాడు ఆ రొమాంటిక్‌ యంగ్‌మన్‌. అయితే ఆ యంగ్‌మన్‌ మేసేజ్‌లు అతని కుటుంబానికి చెందిన ఐమాక్‌లో అలానే ఉండి పోయాయి. ఈ ఐఫోన్‌తో పాటు కుటుంబానికి చెందిన ఆపిల్‌ డివైజ్‌లకు కలిపి ఆపిల్‌ ఒకే ఐడీ ఇవ్వడంతో అసలుకే మోసం వచ్చింది. తాను సెక్స్‌ వర్కర్స్‌తో చేసిన చాటింగ్‌.. మేసేజ్‌లను వ్యాపారి భార్య చూసి తనకు విడాకులు కావాలి అని కోర్టు కెక్కారు. ఐదు మిలియన్‌ పౌండ్లు పరిహారం ఇవ్వాల్సిందేనని ఆమె దావా వేయడంతో వ్యాపారి లబోదిబోమంటూ తన సంసారాన్ని ఆపిల్‌ కూల్చింది మెర్రో అంటూ అతను కూడా ఆపిల్‌ కంపెనీపై కోర్టులో ఐదు మిలియన్‌పౌండ్లకు దావా వేశాడు.

ఆపిల్‌ కంపెనీ మోసం చేసిందని..(Man Sues Apple)

ఇక వ్యాపారి వాదన ఏమిటంటే తనను ఆపిల్‌ కంపెనీ మోసం చేసిందని భగ్గుమంటున్నాడు. ఒక డివైజ్‌లో డెలిట్‌ అయితే ఐ ఫోన్‌తో లింకు ఉన్న అన్నీ డివైజ్‌లలో మేసేజ్‌ డెలిట్‌ కాదని చెప్పలేదని వాదిస్తున్నాడు. ఒక డివైజ్‌లో మేసేజ్‌ డెలిట్‌ అయితే దానితో లింక్‌ అయిన అన్నీ డివైజ్‌లలో డెలిట్‌ అవుతుందని సదరు వ్యాపారవేత్త భావించాడు. ప్రస్తుతం వ్యాపారి భార్య తన భర్త సెక్స్‌ వర్కర్స్‌తో చాటింగ్‌.. మేసేజ్‌లను చూసి వెంటనే తనకు విడాకులు ఇవ్వాలని కోర్టుకెక్కి… ఐదు మిలియన్‌ పౌండ్లు భరణంగా ఇవ్వాలని డిమాండ్‌ చేసినట్లు ది టైమ్స్‌ ఓ కథనాన్ని ప్రచురించింది. విడాకులను తాను తట్టుకోలేనని… తన భార్య తన మేసేజ్‌లను చూడకుండా ఉంటే తన సంసారం కూలేది కాదని ఇప్పుడు తీరిగ్గా వాపోతున్నాడు.

ఇటు భార్య పోయి.. అటు ఐదు మిలియన్‌ పౌండ్లు చెల్లించుకోవాల్సి రావడంతో … వెంటనే సదరు వ్యాపారి ఆపిల్‌పై 5 మిలియన్‌ పౌండ్లకు దావా వేశాడు. దీంతో పాటు తనలాంటి పరిస్థితి ఇతరులకు రావద్దనే కోర్టులో దావా వేశానని తన చర్యను సమర్థించుకున్నాడు వ్యాపారి. తనకు ఆపిల్‌ సరైన క్లారిటి ఇవ్వలేదని.. మేసేజ్‌ డెలట్‌ల గురించి తనకు వివరించి చెప్పలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. ఇక వ్యాపారి న్యాయవాది సైమన్‌ వాల్టన్‌ కూడా తన క్లయింట్‌ను వెనకేసుకువస్తున్నాడు. యూజర్‌ పంపించే మేసేజ్‌లతో పాటు రీసీవ్‌ చేసుకొనే మేసేజ్‌ ఏమవుతున్నాయో ఆపిల్‌కు కూడా తెలియదు.. ముఖ్యంగా డెలిటెడ్‌ మేసేజ్‌లు ఏమవుతున్నాయో తెలియదని ఆయన టెలిగ్రాఫ్‌కు చెప్పాడు. మరి దీనిపై ఆపిల్‌ ఎలా స్పందిస్తుందో చూడాల్సిందే. అందుకే సెక్స్‌ వర్కర్స్‌తో చాటింగ్‌.. మేసేజింగ్‌ చాలా డేంజర్‌ గురూ అనాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Exit mobile version