TTD Drone Video : తిరుమల శ్రీవారి ఆలయం డ్రోన్ వీడియో వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది.
సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావడంతో టీటీడీ అధికారులు అంతా షాక్ అవుతున్నారు.
కాగా టీటీడీ, సెక్యూరిటీ అధికారులు.. ఈ ఘటనపై సీరియస్ గా రంగం లోకి దిగుతున్నారు.
ఆ విజువల్స్‌ని ఫోరెన్సిక్ ల్యాబ్‌కి పంపేందుకు సిద్ధమవుతున్నారు.
సంబంధిత వ్యక్తులపై విచారణకు ఆదేశించినట్టుగా సమాచారం అందుతుంది.
ఈ వీడియో ఇటీవల తీసిందా.. లేకపోతే గతంలోదా అనేది ఇంకా తెలియాల్సి ఉంది.
అయితే వీడియో ఎప్పుడు తీసినా కానీ శ్రీవారి ఆలయాన్ని డ్రోన్ కెమెరాల సహాయంతో ఏరియల్ వ్యూలో చిత్రీకరించడం నిషేధం కాబట్టి ఈ ఘటనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అందుకే సోషల్ మీడియాలో పోస్టుచేసిన వారిపై.. యూట్యూబ్ ఛానెళ్లలో పెట్టినవారిపై చర్యలు తీసుకునేందుకు టీటీడీ సిద్ధమవుతుంది.
శ్రీవారి ఆలయంపై నో ఫ్లై జోన్..
తిరుమల శ్రీవారు కొలువైన కొండపైన ‘నో ఫ్లై జోన్’గా ఉంది. ఆ కొండ పైనుంచి విమానాలు, హెలికాప్టర్లకు ఎగిరేందుకు అనుమతి ఉండదు.
ఆగమశాస్త్రం ప్రకారం కూడా శ్రీవారి ఆలయంపై ఎలాంటి వస్తువులు ఎగరడానికి అనుమతి లేదు.
అయితే ఉన్నట్టుండి తిరుమల దేవాలయానికి సంబంధించిన డ్రోన్ వీడియో సోషల్ మీడియాలో కనిపించింది.
కట్టుదిట్టమైన భద్రత ఉండే చోట ఈ వీడియో ఎలా రికార్డ్ చేశారన్నది మిస్టరీగా మారింది.
సోషల్ మీడియా లో పోస్ట్ చేసింది ఎవరంటే..
ప్రధాన ఆలయం, ఆ చుట్టుపక్కల భద్రతా వలయంలో ఉంటుందని.. కాబట్టి డ్రోన్ కెమెరాతో బంధించడం సాధ్యం కాదంటున్నారు.
ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత తప్పు చేసిన వ్యక్తులపై చట్టపరంగా చర్యలు తప్పవంటున్నారు.
ఇటు ఇన్ స్టాలో విజువల్స్ పోస్ట్ చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకునే ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఆ వీడియోను తీసింది హైదరాబాద్‌కు చెందిన వ్యక్తిగా చెబుతున్నారు.
అలాగే ఈ వీడియో త్రీడీ ఇమేజ్, గూగుల్ లైవ్ వీడియో అయ్యి ఉండొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఐకాన్ అనే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ నుంచి ఈ వీడియో అప్‌లోడ్ అయినట్లు అధికారులు గుర్తించారు.
గత ఏడాది నవంబర్‌లో ఈ వీడియోను అప్‌లోడ్ చేసినట్లు చెబుతున్నారు.
టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఏమన్నారంటే..
కాగా తాజాగా ఈ వివాదంపై తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు.
శ్రీవారి ఆలయ డ్రోన్ షాట్స్ వైదివ వైరల్ కావడం గురించి సుబ్బారెడ్డి వివరణ ఇచ్చారు.
ఆగమ శాస్త్ర నిబంధనల మేరకు ఆనంద నిలయ గోపురంపై విమానాలు, డ్రోన్లు తిరగడం నిషేధం అన్నారు.
సోషల్ మీడియాలో వస్తున్న విజువల్స్ పై విచారణ జరుపుతున్నామని తెలిపారు.
విజువల్స్ అప్‌లోడ్ చేసిన వ్యక్తి హైదరాబాద్ వాసిగా గుర్తించామని, బాధ్యులపై క్రిమినల్ కేసు నమోదు చేస్తామని చెప్పారు.
ఫోటోగ్రఫీ ద్వారా తీసిన ఫోటోలుగా విజిలెన్స్ అదికారులు గుర్తించారని చెప్పిన ఆయన.. అనేక కోణాలు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
కుట్ర కోణంలో టీటీడీపై దుష్ప్రచారం చేస్తున్నారా? అన్న దిశగా కూడా విచారణ జరుపుతున్నామన్నారు. రెండు మూడు రోజుల్లో వాస్తవాలను భక్తుల ముందుకు ఉంచుతామన్నారు.
TTD Chairman YV Subba Reddy confirm the drone video and says a company from #Hyderabad uploaded the video. The vigilance team is verifying the fact and taking appropriate action. #tirumalatirupati #AndhraPradesh pic.twitter.com/sbSY37M6PY
— Ashish (@KP_Aashish) January 21, 2023
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/