Site icon Prime9

TDP MP Appala Naidu: సైకిల్ పై పార్లమెంటుకు వెళ్లిన టీడీపీ ఎంపీ అప్పలనాయుడు

TDP MP Appala Naidu

TDP MP Appala Naidu

TDP MP Appala Naidu: 18వ లోక్ సభకు ఎన్నికయిన పార్లమెంటు సభ్యుల ప్రమాణస్వీకారం నేడు జరిగింది. ఈ సందర్బంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలుగులో ప్రమాణ స్వీకారం చేసారు. మరోవైపు విజయనగరం నుంచి టీడీపీ ఎంపీగా గెలిచిన కలిశెట్టి అప్పలనాయుడు సైకిల్ పై పార్లమెంటుకు వెళ్లి తన ప్రత్యేకతను చాటుకున్నారు.

పసుపు రంగుతోనే..(TDP MP Appala Naidu)

అప్పలనాయుడు ఢిల్లీలో తాను ఉంటున్న అతిధి గృహం నుంచి పార్లమెంటు సమావేశాలకు సైకిల్ పై బయలు దేరి వెళ్లారు. సైకిల్ ముందు భాగాన సైకిల్ గుర్తుపై ఎంపీగా గెలిచిన విజయనగరం ఎంపీ మొదటిరోజు పార్లమెం్లో అడుగుపెడుతున్న వేళ.. అంటూ రాసారు. పసుపురంగు పైజామా ధరించి సైకిల్ కు కూడా పసుపు రంగు వేసారు. మొత్తంమీద అప్పలనాయుడు సైకిల్ ప్రయాణం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

సైకిల్ పై పార్లమెంటుకు వెళ్లిన కలిశెట్టి అప్పలనాయుడు | TDP Appalanaidu | Prime9 News

 

Exit mobile version
Skip to toolbar