Guwahati Railway Station: ప్రస్తుతం అంతా సోషల్ మీడియా జమానా నడుస్తోంది. చీమ చిటుక్కుమన్నా యావత్ ప్రపంచానికి క్షణాల్లో తెలిసిపోతోంది. తాజాగా గువాహతి రైల్వే స్టేషన్‌లో జరిగిన సంఘటన వీడియోను కోట్లాది మంది చూశారు. ఫలితం ఓ ఉద్యోగి కొలువు ఊడింది. వివారల్లోకి వెళితే.. గువాహతి రైల్వేస్టేషన్‌లో ఒక షాపులో కేక్ కొనుగోలు చేయడానికి ఒక కస్టమర్ వెళ్లాడు. అయితే ఈ కేక్ ధర రూ.40లు ఉంటే షాప్ యజమాని రూ.45 డిమండ్ చేశాడు. ఎంఆర్‌పీపై ఎక్కువ ఎందుకు వసూలు చేస్తున్నారని షాప్ యజమానిని కస్టమర్ నిలదీయడంతో అతడి వద్ద జవాబు లేదు. కస్టమర్ ప్రశ్నకు చిరెత్తుకొచ్చిన షాప్ యజమాని డబ్బు తిరిగి ఇచ్చేసి కేక్ వాపస్ తీసుకున్నాడు.
కాగా ఈ వీడియోను ఏవీఐ యూజర్ పేరుతో పోస్ట్ చేయడం జరిగింది. షాపులో ఉద్యోగికి, కస్టమర్‌కు మధ్య మాటల యుద్ధం ముగిసిన తర్వాత షాపు యజమని కస్టమర్ ఫోన్ తీసుకొని నేలమీద కొట్టాలని ప్రయత్నించాడు.అటు తర్వాత రైల్వే అధికారులు వచ్చి రూ.1,000 జరిమానాతో పాటు అతన్ని ఉద్యోగంలోంచి తొలగించారు. కాగా ఈ వీడియో ఈ నెల 4న షేర్ చేయడం జరిగింది. సుమారు 10.7 మిలియన్ వ్యూస్ వచ్చాయి. చాలా మంది ఈ వీడియోను లైక్ చేయడమే కాకుండా కామెంట్లు కూడా పెట్టారు.
బెంగళూరు షాపుల్లో కూడా ఇలాంటి సీన్‌లు కనిపిస్తున్నాయి. ఎంఆర్‌పీ కంటే ఎక్కువ చార్జీ వసూలు చేస్తారు. గువాహతిలో కస్టమర్లతో ఎలా వ్యవహరించాడో అలానే ఇక్కడ వ్యవహరిస్తారని ఒకరు పోస్ట్ పెట్టారు. ఎంఆర్‌పీ కంటే ఎక్కువ చార్జీ చేయరాదు. షాప్ కీపర్ వ్యవహార సరళి బాగాలేదని పలువురు ఆక్షేపించారు. కస్టమర్లతో దురుసుగా ప్రవర్తించే వారిని చట్ట ప్రకారం శిక్షించాల్సిందేనని నెటిజన్లు అన్నారు. అలాంటి వారిపై సానుభూతి పనికిరాదు. వారికి ఇబ్బందులు ఉండవచ్చు. అలాని కస్టమర్లను వేధించడం సరికాదని అంటున్నారు నెటిజన్లు. రైల్వేస్టేషన్లలో, విమానాశ్రయాల్లో కస్టమర్లకు చాయిస్ ఉండదు. అదే సమయంలో టైం ఉండదు. దీన్ని ఆసరాగా చేసుకొని పెద్ద ఎత్తున డబ్బు గుంజుతుంటారు మొత్తానికి చూస్తే షాప్‌కీపర్ ప్రవర్తన మాత్రం దారుణంగా ఉందని నెటిజన్లు మండిపడుతున్నారు.