Girls Eye: ఓ 8 ఏళ్ల బాలిక కుడి కన్ను నుంచి ప్లాస్టిక్ ముక్కలు, బియ్యపు గింజలు, ఇనుప ముక్కలు వంటివి జారిపడుతున్నాయి. ఈ వింత ఘటన మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం పెద్ద కృష్ణాపురంలో జరిగింది. ఇలా జరగడంతో కంగారు పడిన తల్లిదండ్రులు పాపను ఆస్పత్రికి తీసుకెళ్లారు.
https://twitter.com/vikram_TRS/status/1659894020884279297?s=20
షాకింగ్ వీడియో.. (Girls Eye)
ఓ 8 ఏళ్ల బాలిక కుడి కన్ను నుంచి ప్లాస్టిక్ ముక్కలు, బియ్యపు గింజలు, ఇనుప ముక్కలు వంటివి జారిపడుతున్నాయి. ఈ వింత ఘటన మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం పెద్ద కృష్ణాపురంలో జరిగింది. ఇలా జరగడంతో కంగారు పడిన తల్లిదండ్రులు పాపను ఆస్పత్రికి తీసుకెళ్లారు.
మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం పెద్ద కృష్ణాపురంకు చెందిన భుక్యా సౌజన్య ఒకటో తరగతి చదువుతోంది. కొద్ది రోజులుగా పాపకంటి నుంచి.. బియ్యపు గింజలు, ఇనుప ముక్కలు జారిపడుతున్నాయి. ఆస్పత్రికి తీసుకెళ్లిన ఇలానే జరుగుతోందని బాలిక తల్లిదండ్రులు అంటున్నారు. చికిత్స తర్వాత నాలుగు రోజులు బాగానే ఉన్న.. మళ్లీ యధావిధిగా వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
కంట్లో చిన్న నలుసు పడితేనే తట్టుకోలేం.. అలాంటిది పాప కుడి కన్ను నుంచి బియ్యపు గింజలు, ప్లాస్టిక్, ఇనుము, పేపర్ ముక్కలు బయటకు వస్తున్నాయి.
దీంతో ఆ బాలిక నరకయాతన అనుభవిస్తోంది.
గత నెల రోజులుగా ఇలానే జరుగుతున్నట్లు బాలిక తల్లిదండ్రులు తెలిపారు. దీంతో పాపను తల్లిదండ్రులు ఖమ్మం జిల్లాలోని మరో ఆసుపత్రికి తీసుకెళ్లారు.
అక్కడ పాపను పరిశీలించిన వైద్యులు సైతం విస్తుపోతున్నారు. ఇప్పటివరకు ఇలాంటి సంఘటన చూడలేదని వైద్యులు అంటున్నారు.
పాప కన్ను బాగానే ఉందని ఎలాంటి ఇబ్బంది లేదని తెలిపారు. కళ్ల నుంచి అలాంటి వస్తువులు ఉత్పత్తి కావన్నారు.
పాపనే ఆ వస్తువులను కళ్లలో ఉంచుతుందేమోనని అనుమానం వ్యక్తం చేశారు. దీంతో పాపను అబ్జర్వేషన్ లో ఉంచారు.
సౌజన్య చిన్నప్పుడు బాగానే ఉంది. ఉన్నట్లుండి 3 నెలల క్రితం కంటి నుంచి పత్తిగింజ బయటపడింది. వెంటనే పాపను ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు.
అప్పటి నుండి సౌజన్య ఆరోగ్యం బాగానే ఉంది.
అయితే, కొన్ని రోజులకు మళ్లీ ప్లాస్టిక్, పేపర్ ముక్కలు కంటి నుంచి జారిపడుతున్నాయి. దీంతో తల్లిదండ్రులు మళ్లీ కంగారుపడుతున్నారు.
కంటి నుంచి వ్యర్ధాలు వస్తున్న విషయం తెలిసి స్థానికులు అవాక్కయ్యారు. ఇదేదో వింతగా ఉందంటున్నారు.
కంటి నుంచి వింత వస్తువులు వస్తుండటంతో తల్లిదండ్రులు మాత్రం భయాందోళన చెందుతున్నారు. తమ పాపకు ఏమైందోనని బెంగ పెట్టుకున్నారు.
తమది నిరుపేద కుటుంబం అని, ప్రభుత్వమే తమను ఆదుకోవాలని పాప తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.