Site icon Prime9

Renukaswamy Murder Case: చెవి తెగ్గోసి.. వృషణాలు చిద్రం చేసి.. రేణుకా స్వామిని చిత్రవధ చేసి చంపిన హీరో దర్శన్!

Renukaswamy Murder Case

Renukaswamy Murder Case

Renukaswamy Murder Case: శాండిల్‌వుడ్‌ చాలెంజింగ్‌ స్టార్‌ దర్శన్‌ తూగుదీప్‌ తన అభిమాని రేణుకా స్వామిని హత్య చేసిన విషయం తెలిసిందే. తాజాగా రేణుకా స్వామి పోస్ట్‌ మార్టం రిపోర్టులో ఒళ్లు జలదరించే అంశాలు వెలుగు చూశాయి. కాగా దర్శన్‌ ప్రియురాలు పవిత్ర గౌడకు అసభ్యకర సందేశాలు పంపాడన్న కోపంతో దర్శన్‌ రేణుకా స్వామికి హత్య చేసి బెంగళూరు ఫ్లయి ఓవర్‌ వద్ద పడే శాడు. కాగా పోస్ట్‌ మార్టంలో రేణుకాను అత్యంత పాశవికంగా హింసించి చంపేశారు. అతని శరీరంపై ఎక్కడ చూసినా గాయాలే. ఒక చెవితో పాటు మర్మాంగాన్ని చిద్రం చేశారు.

హత్యకు 50 లక్షలు ఖర్చు..(Renukaswamy Murder Case)

రేణుకాస్వామి శవపరీక్ష నివేదికలో విస్తూ పోయే అంశాలు వెలుగు చూశాయి. చనిపోవడానికి ముందుకు రేణుకాకు ఎలక్ర్టిక్‌ షాక్‌లు ఇచ్చారు. అటు తర్వాత చితకబాదిన ఆనవాళ్లు కనిపించాయి. 33 ఏళ్ల రేణుకా స్వామి వృత్తి రీత్యా ఆట్రో డ్రైవర్‌.. ఇటీవల పెళ్లి కూడా చేసుకున్నాడు. భార్య గర్భవతి. కాగా స్వామి కన్నడ సూపర్‌స్టార్‌ దర్శన వీరాభిమాని కూడా. పవిత్ర గౌడ్‌తో దర్శన్‌ అక్రమ సంబంధం పెట్టుకోవడం.. దర్శన్‌ భార్య దీనిపై మీడియాకు ఎక్కడం పెద్ద దుమారమే రేపింది. ఇక దర్శన్‌ అభిమాని పవిత్రను ఉద్దేశించి తన అభిమాని దర్శన కుటుంబాన్నికూల్చవద్దని హెచ్చరించాడు. దీంతో పాటు ఆమెను ఉద్దేశించి కొన్ని అభ్యంతరకర పోస్టులు పెట్టాడు. ఇది కాస్తా పవిత్రకు ఆగ్రహం తెప్పించింది. వెంటనే దర్శన్‌కు రేణుకా స్వామి అంతు చూడాలని కోరడం .. త ప్రియురాలి మాటను కాదనలేక రూ.50 లక్షలు ఖర్చు చేసి రేణుకాస్వామి హత్యకు ప్లాన్‌ చేశాడు దర్శన్‌.

ఇదిలా ఉండగా ఈ కేసుకు సంబంధించి దర్శన్‌, పవిత్రతో పాటు మరో 17 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం శాండిల్‌వుడ్‌ ఈ కేసు పెద్ద దుమారమే రేపుతోంది. కన్నడ సినీ రంగానికి చెందిన టాప్‌ హీరోలు కూడా రేణుకా స్వామికి న్యాయం చేయాలని పోలీసులను డిమాండ్‌ చేశారు. రాష్ర్టంలో దర్శన్‌ను కఠినంగా శిక్షించాలని పెద్ద ఎత్తున ర్యాలీలు కూడా జరిగాయి. కాగా కర్ణాటక హోంమంత్రి పరమేశ్వర కూడా రేణుకా స్వామి కుటుంబసభ్యులను కలిసి ఓదర్చారు. న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

Exit mobile version