Site icon Prime9

Ram Charan Birthday Celebrations : RC15 మూవీ సెట్‌లో చరణ్ బర్త్‌డే సెలబ్రేషన్స్..

ram charan birthday celebrations in rc 15 movie sets

ram charan birthday celebrations in rc 15 movie sets

Ram Charan Birthday Celebrations : మెగాస్టార్ చిరంజీవి వారసుడుగా తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చిన చరణ్.. తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటూ దూసుకుపోతున్నారు. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన “ఆర్ఆర్ఆర్” సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న చరణ్ ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. కాగా కేవలం నటనతోనే కాదు తన వ్యక్తిత్వంతో కూడా  ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు ఈ యంగ్ హీరో. అయితే  ఆర్ఆర్ఆర్ సినిమాతో చరణ్ గ్లోబల్ స్టార్ గా ఎదిగారు. అయితే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం RC15 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోంది.

ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్ట్ చేస్తోండగా.. తమిళ, తెలుగు భాషల్లో ఈ  సినిమాను భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. ఇక ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు అత్యంత భారీ బడ్జెత్‌తో ప్రొడ్యూస్ చేస్తోండటంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా క్రియేట్ అయ్యాయి. ఇప్పటికే మెజారిటీ షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా, తాజాగా ఓ సాంగ్‌ను షూట్ చేస్తోంది. స్టార్ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా కంపోజిషన్‌లో తెరకెక్కుతున్న ఈ సాంగ్ షూట్ నేటితో ముగిసింది. ఇక ఈ సందర్భంగా చిత్ర యూనిట్ రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకలను ముందుగానే సెలబ్రేట్ చేశారు. హీరో చరణ్ కేక్ కట్ చేసి ఈ సాంగ్ షూట్‌కు ప్యాకప్ చెప్పడంతో పాటు తన బర్త్‌డేను అడ్వాన్స్‌గా సెలబ్రేట్ చేసుకోవడం సంతోషంగా ఉందని చిత్ర యూనిట్‌కు థ్యాంక్స్ చెప్పుకొచ్చాడు.

ఈ సందర్భంగా చిత్ర హీరోయిన్ కియారా అద్వానీ, ప్రభుదేవా, దర్శకుడు శంకర్, నిర్మాత దిల్ రాజు హీరో చరణ్’కు బర్త్ డే విషెస్ తెలియజేశారు. ఇక ఈ సినిమాను వీలైనంత త్వరగా షూటింగ్ ముగించేసి, ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. చరణ్ పుట్టిన రోజు సందర్భంగా పలువురు ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ లు పెడుతూ విషెస్ తెలుపుతున్నారు.

మరోవైపు ప్రభుదేవా ప్రస్తుతం రామ్ చరణ్ RC15 మూవీ కోసం ఒక సాంగ్ కోరియోగ్రఫీ చేస్తున్నాడు. నెక్స్ట్ షెడ్యూల్ లో 100 మందికి పైగా డాన్సర్స్ తో చరణ్ అండ్ కియారా పై ఒక సాంగ్ షూట్ చేయనున్నారు. RC15 షూటింగ్ సెట్ లో డాన్సర్స్ తో కలిసి ప్రభుదేవా సాంగ్ డిజైన్ చేస్తున్న సమయంలో చరణ్ అండ్ నాటు నాటు కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ వచ్చారు. కాగా ఈ మేరకు ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవా ఆధ్వర్యంలో ఆర్ఆర్ఆర్ లోని నాటు నాటు పాటకు ఆస్కార్ రావడం పట్ల సెలెబ్రేషన్స్ గ్రాండ్ గా జరిగాయి. ప్రభుదేవాతో పాటు వందలాది మంది కో డ్యాన్సర్లతో కలసి నాటు నాటు పాటకి స్టెప్పులేస్తూ దుమ్ముదులిపారు. అనంతరం ప్రభుదేవా, రామ్ చరణ్.. నాటు నాటు పాటకి కొరియోగ్రఫీ అందించిన ప్రేమ్ రక్షిత్ మాస్టర్ ని సన్మానించారు. కేక్ కటింగ్ కూడా జరిగింది.

Exit mobile version