Ram Charan – Anand Mahindra : దేశంలోనే తొలిసారి హైదరాబాద్ వేదికగా జరిగిన ఫార్ములా ఈ రేసింగ్ ఘనంగా ముగిసింది. ఈ ఫ్రీక్స్ రేసింగ్ కు క్రికెటర్లు సచిన్ టెండుల్కర్, శిఖర్ ధావన్, దీపక్ హుడా, యజువేంద్ర చాహల్, బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ రేస్‌ను తిలకించారు. టాలీవుడ్ హీరోలు రామ్‌చరణ్, నాగార్జున, నాగచైతన్య, కేజీఎఫ్ హీరో యష్, దుల్కర్ సల్మాన్, అఖిల్, సిద్దు జొన్నలగడ్డ, చిరంజీవి కుమార్తె సుస్మిత, మహేష్ బాబు కుమారుడు గౌతమ్.. రేసింగ్ పోటీలను తిలకించారు.
ఈ రేసింగ్ కి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. అలానే కాగా రేసింగ్ ఈవెంట్ లో పాల్గొన్న రాంచరణ్‌తో కలిసి నాటునాటు సాంగ్‌కు పాదం కదిపారు ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా. ఆనంద్ మహీంద్ర ఎప్పుడు ఏదో ఒక వార్తల్లో ఉంటూనే ఉంటారు. అయితే ఈ రేసింగ్ ఈవెంట్ లో రామ్ చరణ్ ని కలిసిన ఆనంద్ మహీంద్ర తాజాగా RRRలోని నాటు నాటు బేసిక్ స్టెప్స్‌ను రామ్ చరణ్ దగ్గర నేర్చుకుని తనతో కలిసి స్టెప్స్ వేశారు. దానికి సంబంధించిన వీడియోను కూడా ఆయన తన ట్విట్టర్‌లో షేర్ చేసుకున్నారు. అలాగే అధే సమయంలో RRR చిత్రానికి ఆస్కార్ రావాలని కూడా ఆయన యూనిట్‌కి అభినందనలు తెలియజేశారు.
Well apart from the race, one real bonus at the #HyderabadEPrix was getting lessons from @AlwaysRamCharan on the basic #NaatuNaatu steps. Thank you and good luck at the Oscars, my friend! pic.twitter.com/YUWTcCvCdw
— anand mahindra (@anandmahindra) February 11, 2023
(Ram Charan – Anand Mahindra) వైరల్ గా మారిన వీడియో ..
దీంతో రామ్ చరణ్, ఆనంద్ మహేంద్ర డాన్స్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అలాగే మాస్టర్ బ్లాస్టర్ సచిన్, రామ్ చరణ్ ప్రత్యేకంగా కలుసుకున్నారు. చాలా సేపు మాట్లాడుకున్నారు. వారిద్దరూ కలిసి రేసింగ్ వెహికల్‌ను కూడా నడపటం విశేషం అని చెప్పాలి. దానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి కూడా. సచిన్‌తో ఉన్న ఫొటోలను రామ్ చరణ్ తన సోషల్ మీడియాలోనూ షేర్ చేసిన సంగతి తెలిసిందే.
ఇక రామ్ చరణ్ సినిమాల విషయానికి వస్తే ఆర్ఆర్ఆర్ తో ఇంటర్నేషనల్ స్థాయిలో గుర్తింపు పొందిన రామ్ చరణ్.. ఇప్పుడు శంకర్ దర్శకత్వంలో RC 15 మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఇటీవలే హైదరాబాద్ లోని చార్మినార్ వద్ద, కర్నూలు లోని కొండా రెడ్డి బూరుజుపై చిత్రీకరణను జరుపుకుంది. ఆ వీడియోని మీరు కూడా ఓ లుక్కేయండి..
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/