Pawan Kalyan Pen: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు వదినమ్మ గిఫ్ట్ ఇచ్చింది. పవన్ కళ్యాణ్‌కు పెన్నును బహూకరించారు సురేఖ. తెలుగు ప్రజల ఆకాంక్షల్ని నిజం చేస్తావని ఆశిస్తూ… పవన్‌కు పెన్నును గిఫ్ట్‌గా ఇచ్చారు వదిన, అన్నయ్య. పెన్నుతో ఫోటో పవన్, చిరంజీవి దంపతులు ఫోటో దిగారు.
నోట్‌ప్యాడ్‌తో పాటు పెన్..( Pawan Kalyan Pen)
వీడియోలో, సురేఖ పవన్‌కి మిక్కీ మౌస్ లోగోతో కూడిన నోట్‌ప్యాడ్‌తో పాటు వాల్ట్ డిస్నీ మాంట్‌బ్లాంక్ పెన్ బహుమతిగా ఇచ్చారు వదినమ్మ సురేఖ తన జేబులో పెన్ను పెడుతున్న సందర్బంగా పవన్ భావోద్వేగానికి గురయ్యారు. చిరు, సురేఖ పవన్‌కు ప్రత్యేక సందేశం ఇవ్వడంతో వీడియో ముగిసింది. తెలుగు ప్రజలందరి ఆశలు మరియు ఆకాంక్షలు నెరవేరాలని నీకు హృదయపూర్వక శుభాకాంక్షలు మరియు ఆశీర్వాదాలతో – వదిన, అన్నయ్య అంటూ పేర్కొన్నారు. పవన్ భార్య అన్నా లెజ్నెవా కూడా వారితో కలిసి ఉండటాన్ని వీడియోలో చూడవచ్చు. ఈ వీడియోను మెగాస్టార్ చిరంజీవి సామాజిక మాధ్యమం X లో షేర్ చేసారు.
కళ్యాణ్ బాబుకు వదినమ్మ బహుమతి! 😍@PawanKalyan pic.twitter.com/vzt6rNX7gt
— Chiranjeevi Konidela (@KChiruTweets) June 15, 2024