Nani 30: నేచురల్ స్టార్ నాని హీరోగా ఓ సినిమా తెరకెక్కుతుంది. నూతన దర్శకుడు శౌర్య దీనికి దర్శకత్వం వహిస్తుండగా, వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మోహన్ చెరుకూరి, డాక్టర్ విజేందర్ రెడ్డి తీగల, మూర్తి కేఎస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. `సీతారామం` ఫేమ్ మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా మంగళవారం ప్రారంభమైంది. హైదరాబాద్‌లో గ్రాండ్ స్కేల్లో మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా సినిమా షూరూ అయ్యింది.
హీరో నానిపై ముహూర్తపు షాట్‌కి చిరంజీవి క్లాప్ నిచ్చారు. నిర్మాత అశ్వినీదత్ కెమెరా స్విచాన్ చేశారు. దర్శకుడు బుచ్చిబాబు, కిషోర్ తిరుమల, హను రాఘవపూడి, వశిష్ట, వివేక్ ఆత్రేయ కలిసి తొలి షాట్‌కి దర్శకత్వం వహించారు. ప్రముఖ రైటర్ విజయేంద్రప్రసాద్ స్క్రిప్ట్ అందించారు. ఈ కార్యక్రమంలో `పలాస` ఫేమ్ కరుణ కుమార్, గిరీష్ అయ్యర్, దేవా కట్టా, చోటా కె నాయుడు, సురేష్‌బాబు, దిల్‌రాజు, రామ్ గోపీ ఆచంటలు, అనిల్ సుంకర, రవిశంకర్, దివివి దానయ్య, స్రవంతి రవికిశోర్, కెఎస్ రామారావు, సాహు గారపాటి, ఏసియన్ సునీల్ వంటి సినీ ప్రముఖులు ఈ ఈవెంట్ లో పాల్గొన్నారు.