Site icon Prime9

TSRTC Bus Tracking: ఒక్క క్లిక్‌తో ఆర్టీసీ బస్సు ఎక్కడుందో తెలుసుకోవచ్చు!

TSRTC Bus Tracking

TSRTC Bus Tracking

TSRTC Bus Tracking: సంక్రాంతికి ప్రజలను సురక్షితంగా సొంతూళ్లకు చేర్చేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ పకడ్బందీ చర్యలు తీసుకుంటోంది. ప్రయాణికులకు ఏమాత్రం అసౌకర్యం కలుగకుండా ఉండేందుకు. సాంకేతికను ఉపయోగిస్తుంది. అందుకు ‘TSRTC Bus Tracking’ యాప్‌ను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకువచ్చింది.

 

వెయిట్ చేసే పనిలేదు..

ప్రస్తుతం చాలా మంది ముందస్తు బుకింగ్‌ చేసుకుంటున్న ప్రయాణికుల ఫోన్లకు టికెట్ వివరాలతో పాటు బస్సు ట్రాకింగ్‌ లింక్‌ను సందేశరూపంలో అధికారులు పంపిస్తున్నారు. ఆ లింక్‌పై క్లిక్‌ చేయగానే బస్సు ఎక్కడుందో ప్రయాణికులు సులువుగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. ట్రాకింగ్‌ యాప్‌ వివరాల ఆధారంగా బస్సు వచ్చే సమయాన్ని కచ్చితంగా తెలుసుకోవచ్చు.

ప్రస్తుతం ముందస్తు రిజర్వేషన్‌ చేసుకునే 1800 బస్సు సర్వీస్‌లకు బస్సు ట్రాకింగ్‌ సదుపాయం కల్పించినట్లు అధికారులు తెలిపారు.

ఈ సంక్రాంతికి ముందుస్తు రిజర్వేషన్‌ సౌకర్యం కల్పించిన 600 ప్రత్యేక బస్సులకూ ట్రాకింగ్‌ సౌకర్యాన్ని అనుసంధానం చేసినట్లు తెలిపింది.

త్వరలోనే హైదరాబాద్‌లోని మెట్రో ఎక్స్‌ప్రెస్‌ సర్వీస్‌లతో సహా మిగిలిన సర్వీస్‌లన్నింటికీ ట్రాకింగ్‌ సదుపాయం కల్పిస్తామని.. ఈ సంక్రాంతికి ప్రయాణికులకు అసౌకర్యం కలగొద్దనే ఉద్దేశంతో వారి ఫోన్లకు బస్సు ట్రాకింగ్‌ లింక్‌ను సందేశరూపంలో పంపిస్తున్నామని పేర్కొంది. ఒక్క క్లిక్‌తో బస్సు ఎక్కడుందో వారు తెలుసుకోవచ్చు.. అంటూ టీఎస్‌ఆర్టీసీ చైర్మన్‌, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్‌, సంస్థ ఎండీ వీసీ సజ్జనర్‌ పేర్కొన్నారు.

యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోండిలా!

‘TSRTC Bus Tracking’ పేరుతో ఈ యాప్‌ గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉంది. టీఎస్‌ఆర్టీసీ అధికారిక వెబ్‌సైట్‌ www.tsrtc.telangana.gov.in నుంచి ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

ఈ యాప్‌లో ప్రయాణికులు ఎలాంటి వ్యక్తిగత వివరాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. అందులో హైదరాబాద్‌ సిటీతో పాటు జిల్లా సర్వీస్‌లకు సంబంధించిన సమాచారాన్ని వేర్వేరుగా టీఎస్‌ఆర్టీసీ పొందుపరిచింది. ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ప్రయాణించే బస్సుల వివరాలతో పాటు అవి ప్రస్తుతమున్న లోకేషన్‌ను తెలుసుకోవచ్చు.

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

 

 

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

Exit mobile version