Kantara 2 : కన్నడ చిత్రం ‘కాంతార’ (Kantara) చిన్న సినిమాగా వచ్చి సినీ ప్రపంచాన్ని ఒక ఊపు ఊపేసింది. ఈ చిత్రం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో వచ్చి ప్రేక్షకులను అలరించింది.
రిషబ్ శెట్టి ( Rishab shetty) దర్శకత్వం వహించి నటించగా , హీరోయిన్ సప్తమి గౌడ అలరించింది. 16 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ ఏకంగా 450 కోట్లకు పైగా వసూల్ చేసి రికార్డులు తిరగరసింది.
ప్రేక్షకులే కాఉండా సినీ ప్రముఖులు సైతం ఈ సినిమా పై ప్రశంసలు వర్షం కురిపించారు.
ఎన్నో అవార్డులను అందుకున్న ఈ సినిమా ఇండియా నుంచి రెండు విభాగాల్లో ఆస్కార్ కి నామినేషన్స్ సాధించి దేశం మరింత గర్వించేలా చేసింది.
అయితే , ఈ సినిమా గురించి తాజా అప్ డేట్ ఇచ్చారు చిత్ర నిర్మాత, హోంబలే ఫిల్మ్స్ అధినేత విజయ్ కిరంగదూర్. కాంతార సినిమాకు పార్ట్ 2 (Kantara 2) రాబోతున్నట్టు ఆయన ప్రకటించారు.
అయితే ఇది కాంతార కు సీక్వేల్ కాదని ప్రీక్వేల్ అని ఆయన తెలిపారు. ‘ కాంతార 2 కు ప్రణాళికలు సిద్ధం చేశాం. రిషబ్ శెట్టి ఇప్పటికే పార్ట్ 2 కు సంబంధించిన పనులు మొదలు పెట్టారు.
జూన్ నుంచి షూటింగ్ స్టార్ట్ చేస్తాం. వర్షాకాలంలో కొన్ని సీన్స్ ఉన్నాయి. అందుకే జూన్ నుంచి మొదలు పెట్టాలనుకుంటున్నాం.
పాన్ ఇండియా స్థాయిలో 2024 వేసవి కానుకగా ఈ సినిమా ను విడుదల చేయాలని అనుకుంటున్నాం’ అని విజయ్ పేర్కొన్నారు.
కర్ణాటకలోని తులు ప్రాంతలో భూత కోల నేపథ్యంలో కాంతార (Kantara) తెరకెక్కించారు. సినిమా మొత్తం ఒకెత్తు అయితే క్లైమాక్స్ మాత్రం మరో ఎత్తు.
భూత కోల ఆడే వ్యక్తిన పంజుర్లి ఆవహించడం.. వారాహ రూపం సాంగ్ వంటివి సినిమాను మరో స్ధాయికి తీసుకెళ్లాయి. రికార్డులన్నీ బ్రేక్ చేసింది ఈ సినిమా.
కాంతార సినిమాతో భూత కోల అనే సంప్రదాయం ప్రపంచానికి తెలిసింది. ఇపుడు ప్రీక్వెల్ గా వస్తున్న కాంతార పార్ట్ 2 లో ఎలాంటి నేపథ్యం ఉంటుందనే ఆసక్తి నెలకొంది.
అందులో భూమిని రక్షించడానికి గ్రామస్థుల తో పాటు రాజు ఏం చేశాడనేది చూపించబోతున్నారట.
తాజాగా హోంబలే ఫిల్మ్స్ కాంతార క్లైమాక్స్ అనుభవం రియల్ లైప్ లోనూ ఎదురైందని ఓ వీడియోను షేర్ చేసింది.
రిషబ్ శెట్టి( Rishab shetty), సప్తమి గౌడ తో పాటు చిత్ర యూనిట్ తులునాడులో పంజుర్లీ ఉత్సవానికి హాజరై ప్రత్యేక పూజలు చేశారు.
ఆ క్రమంలో అక్కడ ఓ వ్యక్తి భూతకోల ఆడటం.. పంజుర్లి అతనిని ఆవహించడం.. ఈ సన్నివేశాలను చిత్ర యూనిట్ దగ్గరుండి చూశారు.
పంజుర్లి ఆవహించిన వ్యక్తి అక్కడ ఉండే గ్రామస్థులతో పాటు రిషబ్ శెట్టిని ఆత్మీయంగా పట్టుకోవడం ఈ వీడియో లో కనిపిస్తుంది.
‘ప్రకృతికి కట్టుబడి మనకు స్వేచ్ఛ, విజయాన్ని అందిస్తోన్న దైవాన్ని ఆరాధించండి. కాంతార బృందం నిజ జీవితంలో దైవానుగ్రహాన్ని పొందింది’ అని నిర్మాణ సంస్థ తన ట్విటర్ ఖాతాలో వీడియో షేర్ చేసింది.
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/