Kannada Actor Darshan: శాండిల్‌వుడ్ టాప్ హీరో దర్శన్ తూగుదీప, ఆయన భార్యపవిత్ర గౌడను ఓ హత్య కేసులో పోలీసులు అదుపులో తీసుకుని ప్రశ్నిస్తున్నారు. కాగా దర్శన్ బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తిని హత్య చేయడంలో కీలకపాత్ర వహించాడని పోలీసులు మంగళవారం చెప్పారు. దర్శన్‌తో పాటు ఆయన భార్య పవిత్ర, మరో పది మందిని కూడా పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. కాగా ఈ 47 ఏళ్ల నటుడిని మైసూరులో ఆయన ఫాం హౌస్ నుంచి అరెస్టు చేసి బెంగళూరుకి ప్రశ్నించేందుకు తరలించారు. ఇక బాధితుడి విషయానికి వస్తే 33 ఏళ్ల రేణుకా స్వామి బెంగళూరులోని సుమన్‌హల్లి బ్రిడ్జి వద్ద శవమై కనిపించాడు. కాగా బాధితుడు స్వామి అపోలో పార్మసీ చిత్రదుర్గ బ్రాంచిలో పనిచేసేవాడు. కాగా స్వామి దర్శన్ భార్యకు అభ్యంతకరమైన సందేశాలు పంపేవాడని తెలిసింది.
ముగ్గురు వ్యక్తుల అరెస్ట్ .. (Kannada Actor Darshan)
ఈ కేసుకు సంబంధించి సోమవారం ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. వీరంతా దర్శన్ ఆదేశాల మేరకు తాము హత్య చేశామని చెప్పారు. ఇదిలా ఉండగా స్వామి తల్లిదండ్రులు తమ కుమారుడు తప్పిపోయాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేస్తే రెండు రోజుల క్రితమే పోలీసులు ఈ కేసును టేకప్ చేశారు. కాగా ఈ హత్య ఈ నెల 9వ తేదీన జరిగింది. అంతకు ముందు రోజు నుంచి స్వామి కనిపించకుండా పోయాడు. పోలీసులు కేసు రిజిస్టర్ చేసుకున్నారు. కాగా స్వామి తల్లి ఫిర్యాదు మేరకు దర్శన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ప్రస్తుతం పోలీసులు దర్శన్ హత్యలో ప్రత్యక్షంగా పాల్గొన్నాడా లేక హత్యకు కుట్ర పన్నాడా అనే కోణంలో విచారణ కొనసాగుతోంది. కాగా దర్శన్ నివాసం ఆర్‌ఆర్ నగర్ చుట్టుపక్కల గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా కన్నడ సినియా ఇండస్ర్టీలో దర్శన్ టాప్ హీరోగా చలామణి అవుతున్నాడు. శాండిల్‌వుడ్‌లో ఆయన నిర్మాతతో పాటు పంపిణీదారు కూడా. ముందుగా టెలివిజన్‌తో తన కెరీర్ ప్రారంభించి అటు తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఆయన సూపర్‌హిట్ సినిమాల విషయానికి వస్తే కలపిపల్య, సారథి, యాజమన, రాబర్ట్ చివరగా అతను కాటెరా చిత్రంలో నిటించారు. గత ఏడాది ఈ చిత్రం కర్ణాటకలో విడుదలైంది.