Site icon Prime9

Rishab Pant : “ఒక అడుగు ముందుకు” అంటున్న రిషబ్ పంత్.. వైరల్ గా మారిన సోషల్ మీడియా పోస్ట్

indian cricketer rishab pant post on social media goes viral

indian cricketer rishab pant post on social media goes viral

Rishab Pant : భారత క్రికెట‌ర్ రిష‌బ్ పంత్ గ‌తేడాది డిసెంబ‌ర్ లో కారు ప్ర‌మాదానికి గురై తీవ్రంగా గాయ‌ప‌డిన విష‌యం అందరికి తెలిసిందే.

స్వ‌యంగా కారును డ్రైవ్ చేసుకుంటూ హ‌రిద్వార్ – ఢిల్లీ హైవేపై పంత్ ప్ర‌యాణిస్తున్నాడు.

తెల్లవారుజామున కారు డైవింగ్ చేస్తున్న క్రమంలో వేగంగా వెళ్తున్న కారు డివైడ‌ర్‌ను ఢీకొట్టింది.

ఈ ప్ర‌మాదంలో పంత్ కారుకు ఒక్క‌సారిగా మంట‌లు వ్యాపించాయి.

ఆ సమయంలోనే అటుగా వెళ్తున్న హర్యానా రోడ్ వేస్ కు చెందిన డ్రైవర్, స్థానికులైన ఇద్దరు యువకులు పంత్ ను కారు నుంచి బయటికి తీసుకువచ్చారు.

అప్పటికే పంత్ కు తీవ్రగాయాలయ్యాయి. సకాలంలో ఆసుపత్రికి తరలించడంతో పంత్ కు ప్రాణాపాయం తప్పింది.

 

అక్క‌డి నుంచి వెంట‌నే డెహ్రాడూన్‌లోని మ్యాక్స్ హాస్పిట‌ల్‌కు త‌ర‌లించి చికిత్స అందించారు. కొద్దిరోజుల త‌రువాత బీసీసీఐ పంత్‌కు మెరుగైన చికిత్స అందించేందుకు ముంబైలోని కోకిలాబెన్ ఆస్ప‌త్రికి త‌ర‌లించింది. ఇటీవ‌ల పంత్ మోకాలి లిగ్మెంట్ శ‌స్త్ర చికిత్స చేశారు. అయితే ఇప్పుడు తాజాగా అందరికి ఓ గుడ్ న్యూస్ చెప్పాడు ఈ యంగ్ క్రికెటర్.

ఒక అడుగు ముందుకు.. ఒక అడుగు ధృడంగా – పంత్ (Rishab Pant)

వాకింగ్ స్టిక్ స‌హాయంతో మెల్ల‌గా న‌డ‌క మొద‌లు పెట్టాడు పంత్. ఇందుకు సంబంధించిన ఫొటోను పంత్ త‌న సోస‌ల్ మీడియా ఖాతాలో పోస్టు చేశాడు. దీనికి కాప్షన్ గా “ఒక అడుగు ముందుకు.. ఒక అడుగు ధృడంగా.. ఒక అడుగు మెరుగ్గా ” అని రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. దీంతో నెటిజ‌న్లు పంత్ త్వ‌ర‌గా కోరుకోవాల‌ని కామెంట్స్ చేస్తున్నారు. అలానే టీమిండియా ప్లేయర్స్ కూడా పంత్ త్వరగా కొలుకోవాలని కామెంట్లు చేస్తున్నారు.

అదే విధంగా ఆస్ట్రేలియా ఓపెన‌ర్ డేవిడ్ వార్న‌ర్ కూడా పంత్ పోస్ట్ కి కామెంట్ చేశారు. పంత్ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని రాసుకొచ్చాడు. ప్ర‌స్తుతం ఆస్ట్రేలియా – ఇండియా మధ్య బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ ట్రోఫీ జరుగుతుంది. ఆ ఫోటోలో పంత్ వాకింగ్ స్టిక్స్ ప‌ట్టుకొని న‌డుస్తున్నాడు. అత‌డి కుడి కాలికి బ్యాండేజ్ క‌నిపిస్తోంది. పంత్ పూర్తిగా కోలుకోవడానికి కొన్ని నెలలు పడుతుందని డాక్టర్లు వెల్లడించారు. రోడ్డు ప్ర‌మాదం కార‌ణంగా ఐపీఎల్‌తో పాటు వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్‌కు పంత్ దూరం కానున్నాడు.

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

 

Exit mobile version