Site icon Prime9

Amitabh’s statue: రూ.60 లక్షలతో ఇంటివద్ద అమితాబ్ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన ఇండియన్ కపుల్

Amitabh's statue at home

Amitabh's statue at home

Amitabh’s statue: న్యూజెర్సీలోని ఎడిసన్ సిటీలో తమ ఇంటివద్ద బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ లైఫ్ సైజ్ విగ్రహాన్ని భారతీయ-అమెరికన్ కుటుంబం ఏర్పాటు చేసింది.ఎడిసన్‌లోని రింకు మరియు గోపీ సేథ్‌ల ఇంటి వెలుపల భారీ ఎత్తున ప్రజలు గుమికూడి పటాసులు కాల్చారు. గోపీ సేథ్ ఇంటర్నెట్ సెక్యూరిటీ ఇంజనీర్ గా పనిచేస్తున్నారు.

ఈ సందర్బంగా అతను మాట్లాడుతుూ బిగ్ బి నాకు మరియు నా భార్యకు దేవుడు లాంటివాడని అన్నారు. తని గురించి నాకు స్ఫూర్తినిచ్చే అతి పెద్ద విషయం ఏమిటంటే, అతని రీల్ జీవితం మాత్రమే కాదు, నిజ జీవితం కూడా .అతను చాలా డౌన్ టు ఎర్త్. . అందుకే నా ఇంటి వెలుపల అతని విగ్రహం ఉండాలని నేను అనుకున్నాను అని సేథ్ చెప్పారు. బచ్చన్ తన “కౌన్ బనేగా కరోర్ పతి సెట్లో లో కూర్చున్నట్లు చూపించే లైఫ్ సైజు విగ్రహం ప్రత్యేకంగా రాజస్థాన్‌లో తయారు చేయించి అమెరికాకు తీసుకువెళ్లారు. దీనికి రూ.60 లక్షలకంటే పైనే ఖర్చయింది.

1990లో తూర్పు గుజరాత్‌లోని దాహోద్ నుండి యూఎస్ చేరుకున్న సేథ్, గత మూడు దశాబ్దాలుగా “బిగ్ బి ఎక్స్‌టెండెడ్ ఫ్యామిలీ” కోసం www.BigBEFamily.com అనే వెబ్‌సైట్‌ను నడుపుతున్నారు.యుఎస్‌లో విగ్రహాన్ని ఏర్పాటు చేయడం చాలా సవాళ్లతో కూడుకున్నదని గోపీ సేథ్‌ అన్నారు.

Exit mobile version