Site icon Prime9

Idly Lover : ఏడాదిలో రూ.6 లక్షల విలువ చేసే ఇడ్లీలు కొన్న కస్టమర్..

idly lover from hyderbad buys 6 lakhs worth idly from swiggy in 1 year

idly lover from hyderbad buys 6 lakhs worth idly from swiggy in 1 year

Idly Lover : మన దేశం గురించి చెప్పాలంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఠక్కున అందరూ చెప్పే ఏకైక మాట “భిన్నత్వంలో ఏకత్వం”. విభిన్న ప్రాంతాలు.. విభిన్న మతాలు.. విభిన్న ఆచారాలు.. ఇలా ఎన్నో వైవిధ్యాలు ఉన్నప్పటికీ అందరూ కలిసి ఒక్కటిగా జీవిస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నాం.  అదే విధంగా ఆహారం విషయంలో కూడా పలు ప్రాంతాల్లో పలు రకాలుగా ఆహారపు అలవాట్లు ఉంటాయి. ప్రాంతాన్ని బట్టి మన దేశంలో బ్రేక్‌ఫాస్ట్‌ వంటకాలు మారుతుంటాయి. అయితే ఎన్ని రుచులున్నా కానీ దక్షిణాదిలో అందరూ ఎక్కువగా తినే టిఫిన్ అంటే ‘ఇడ్లీ’ అనే చెప్పవచ్చు.

ఇడ్లీ.. రుచితో పాటు ఆరోగ్యానికి కూడా మంచిదని ప్రజలు ఎక్కువగా ఇష్టపడుతారు. అయితే ఈ స్టోరీలో చెప్పుకునే వ్యక్తి మాత్రం ఇడ్లీ లవర్ అని చెప్పవచ్చు. ఎంత ఇస్తాం ఉంటే మాత్రం మరి ఇంత ప్రేమ ఎలా బ్రో అని మాత్రం అనకుండా ఉండలేరు. సదరు వ్యక్తి  ప్రముఖ ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ యాప్‌ స్విగ్గీలో ఈ వంటకాన్నే అత్యధికంగా ఆర్డర్‌ చేశారు. ఏడాది కాలంలో ఏకంగా రూ.6 లక్షల విలువ చేసే ఇడ్లీలను కొనుగోలు చేశారు.  మార్చి 30 వ తేదీన ‘ప్రపంచ ఇడ్లీ దినోత్సవాన్ని’ పురస్కరించుకుని స్విగ్గీ.. ఇడ్లీ అమ్మకాలపై వార్షిక నివేదికను విడుదల చేసింది.

అందులో 2022 మార్చి 30 నుంచి 2023 మార్చి 25 మధ్య కాలంలో స్విగ్గీ 3.3 కోట్ల ప్లేట్ల ఇడ్లీలను డెలివరీ చేసిందట. అత్యధికంగా బెంగళూరు, హైదరాబాద్‌, చెన్నై నగరాల నుంచి ఈ ఆర్డర్లు వచ్చినట్లు కంపెనీ వెల్లడించింది. ఆ తర్వాత కోల్‌కతా, కోచి, ముంబయి, కొయంబత్తూర్‌, పుణె నుంచి కూడా ఇడ్లీ ఆర్డర్లు అత్యధికంగా ఉన్నట్లు పేర్కొంది. ఇక, హైదరాబాద్‌కు చెందిన ఓ స్విగ్గీ కస్టమర్ ఏడాది కాలంలో రూ.6 లక్షల విలువ చేసే ఇడ్లీలను తమ వేదికపై ఆర్డర్‌ చేసినట్లు పేర్కొంది.

ఆ కస్టమర్‌ మొత్తం 8,428 ప్లేట్ల ఇడ్లీలను స్విగ్గీలో కొనుగోలు చేశారని తెలిపింది. కానీ ఆ కస్టమర్ వివరాలను మాత్రం స్విగ్గీ యాజమాన్యం వెల్లడించకపోవడం గమనార్హం. దీంతో  ఇడ్లీ లవర్ స్టోరీ మీడియాలో వైరల్ గా మారింది. అదే విధంగా హైదరాబాద్‌ లో మాత్రమే గాక.. బెంగళూరు, చెన్నై నుంచి కూడా ఆ వ్యక్తి ఆర్డర్‌ చేసినట్లు వెల్లడించింది. ఇక స్విగ్గీలో ఎక్కువ మంది మసాలా దోశను కొనుగోలు చేసినట్లు కంపెనీ తన నివేదికలో పేర్కొంది. మొత్తానికి ఇడ్లీ మీద ఇంత ఇస్తాం ఉన్న వ్యక్తులు కూడా ఉంటారా అని అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

 

Exit mobile version