Site icon Prime9

Dailyhunt: ఢిల్లీలో జరిగిన గ్రాండ్ ఫినాలేలో #StoryForGlory ముగించిన Dailyhunt మరియు AMG మీడియా నెట్‌వర్క్స్ లిమిటెడ్

Dailyhunt and AMG Media Networks Limited Conclude StoryForGlory in a Grand Finale in Delhi

Dailyhunt: భారతదేశపు #1 స్థానిక భాషా కంటెంట్ ప్లాట్‌ఫారమ్ డైలీహంట్, మరియు ఏఎంజీ మీడియా నెట్‌వర్క్స్ లిమిటెడ్, ప్రముఖ ఇంటిగ్రేటెడ్ వ్యాపార సమ్మేళనం అదానీ గ్రూప్ సంయుక్తంగా నిర్వహించిన “స్టోరీ ఫర్ గ్లోరీ దేశపు తదుపరి మంచి కథకుడు ప్రోగాం” ముగిసింది. దేశవ్యాప్తంగా కథకుల కోసం మీడియా నెట్వర్స్క్ ఆహ్వానం పలికిన సంగంతి విదితమే కాగా ఈ ప్రోగ్రాం ఫినాలే కార్యక్రమం ఢిల్లీలో ఘనంగా ముగిసింది.

వీడియో మరియు ప్రింట్ అనే రెండు కేటగిరీల క్రింద 12 మంది విజేతలను కనుగొనడంతో దేశవ్యాప్తంగా టాలెంట్ హంట్ను నిర్వహించిన సంగతి విదితమే కాగా మేలో ప్రారంభమైన ఈ కార్యక్రమం నాలుగు నెలల సుదీర్ఘ కాలంలో 1000కు పైగా దరఖాస్తులను అందుకుంది. కాగా అందులో ప్రతిభావంతులైన 20 మందిని షార్ట్‌లిస్ట్ చేసింది.

ఈ విధంగా ఎంపిక చేయబడిన అభ్యర్థులకు ప్రముఖ మీడియా సంస్థ అయిన MICAలో ఎనిమిది వారాల పాటు ఫెలోషిప్ మరియు రెండు వారాల లెర్నింగ్ ప్రోగ్రామ్‌ను అందించారు. ప్రముఖ మీడియా పబ్లిషింగ్ సంస్థల నుంచి మార్గదర్శకాలను పొందారు. ఈ ప్రోగ్రామ్ సమయంలో వారి నైపుణ్యాన్ని పెంపొందించడం మరియు వారి కథనాన్ని మరియు కంటెంట్ను పెంచుకోవడానికి అనుభవపూర్వకమైన అభ్యాసాన్ని అందించారు.

ఈ కార్యక్రమం ముగింపులో ఎంపికైన 20 మంది ఫైనలిస్టులు తమ ప్రాజెక్ట్‌లను స్టోరీ ఫర్ గ్లోరీ టీంకు సమర్పించారు. వాటిలో బెస్ట్ ప్రాజెక్టులు సమర్పించిన 12 మందిని జ్యూరీ విజేతలుగా ఎంపిక చేసింది స్టోరీ ఫర్ గ్లోరీ టీం. జ్యూరీ అవార్డు గ్రహీతలుగా #dailyhunt వ్యవస్థాపకుడు వీరేంద్ర గుప్తా, AMG మీడియా నెట్‌వర్క్స్ లిమిటెడ్ CEO సంజయ్ పుగాలియా, ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ గ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ గోయెంకా ఫిల్మ్ కంపానియన్ అనుపమ ఫౌండర్ చోప్రా; షీ ద పీపుల్ వ్యవస్థాపకుడు శైలీ చోప్రా; గావ్ కనెక్షన్ వ్యవస్థాపకుడు నీలేష్ మిశ్రా, మరియు ఫ్యాక్టర్ డైలీ సహ వ్యవస్థాపకుడు పంకజ్ మిశ్రా ఉన్నారు.

స్టోరీ ఫర్ గ్లోరీ ప్రజల నుండి ప్రత్యేకమైన స్వరాలను గుర్తించింది. మరియు జర్నలిజం రంగంలో వారి వృత్తిని ప్రవృత్తిగా మార్చుకుంటూ ప్రజలకు తమ గళాన్ని వీలైనంత సులువుగా వివరించే మార్గాన్ని సుగమం చేసుకోవడానికి మరియు సృజనాత్మక కంటెంట్‌తో పెద్ద మీడియా పర్యావరణ వ్యవస్థను రూపొందించడానికి మంచి అవకాశాన్ని అందించింది.

Exit mobile version