Site icon Prime9

Anant Ambani – Radhika Merchant Wedding: వైభవంగా అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ వివాహం

Anant Ambani Marriage

Anant Ambani Marriage

Anant Ambani – Radhika Merchant Wedding: నీతా, ముకేశ్ అంబానీ గారాల కొడుకు అనంత్ అంబానీ మ్యారేజ్ అట్టహాసంగా చాలా గ్రాండ్ గా జరిగింది. ఈ వివాహ వేడుకకు దేశంలోనే కాదు..వరల్డ్ వైడ్ గా ఉన్న వీవీఐపీలు హాజరయ్యారు. ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ పెళ్లి వేడుక అట్టహాసంగా నిర్వహించారు. వధూవరుల వరమాల కార్యక్రమం ఘనంగా సాగింది. ఈ కార్యక్రమానికి దేశవిదేశాల నుంచి ప్రముఖులు హాజరయ్యారు. ఆకాశమంత పందిరి.. భూదేవంత వాకిలిగా అనంత్, రాధిక పెళ్లి వేడుకలు జరుగుతున్నాయి.

అంబానీ ఇంట పెళ్లి..ఇక ఓ రేంజ్ లో చేయాలనుకున్నారు. ప్రపంచం మొత్తం మాట్లాడుకునే స్టేజ్ కి చేరింది. అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ పెళ్లి వార్త ఎప్పుడైతే బయటకు వచ్చిందో అప్పుడే వరల్డ్ వైడ్ గా పెళ్లి సందడి నెలకొంది. అందుకే ఎక్కడ చూసినా..ఎక్కడ విన్నా అంబానీ ఇంట పెళ్లి కబుర్లే వినిపిస్తున్నాయి..కనిపిస్తున్నాయి. అపర కుబేరుడు ముకేశ్‌ అంబానీ ఇంట పెళ్లి వేడుకలు మూడురోజులపాటు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. చిన్న కొడుకు అనంత్‌ అంబానీ, రాధికా మర్చంట్‌ల మ్యారేజ్ కనులపండువగా కొనసాగుతోంది. దేశ ,విదేశాలకు చెందిన అతిరథ మహారథులు, సినీ ప్రముఖులు హాజరై వేడుకల్లో సందడి చేశారు.

మెరిసిన సినీ తారలు..(Anant Ambani – Radhika Merchant Wedding)

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన భార్య ఉపాసనతో కలిసి అనంత్, రాధిక పెళ్లికి హాజరయ్యారు. అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీ, నయనతార, విఘ్నేశ్ శివన్, సూర్య, జ్యోతిక, రానా దగ్గుబాటి తన భార్య మిహికాతో కలిసి అనంత్, రాధిక పెళ్లిలో సందడి చేశారు. ఇక అంబానీ ఇంట పెళ్లి వేడుకలో స్పెషల్ అట్రాక్షన్ అయ్యారు సూపర్ స్టార్ రజినీకాంత్. ముఖ్యంగా వరుడు అనంత్ అంబానీతో కలిసి డాన్స్ చేశారు తలైవా. బాలీవుడ్ హీరోస్ అర్జున్ కపూర్, రణవీర్ సింగ్, విక్కీ కౌశల్ తో కలిసి అనంత్ అంబానీ, రజినీకాంత్ డాన్స్ చేశారు. 73 ఏళ్ల వయసులోనూ అదిరిపోయే స్టెప్పులతో డాన్స్ అదరగొట్టేశారు రజినీకాంత్. తలైవా ఎనర్టిటిక్ స్టెప్పులు చూసి బాలీవుడ్ స్టార్ ఆశ్చర్యపోయారు. ఈ పెళ్లికి వచ్చిన అతిథులతో ముంబై నగరం అంతా కోలాహలంగా మారింది. ఇవాళ శుభ్‌ ఆశీర్వాద్‌, 14న మంగళ్‌ ఉత్సవ్‌తో ముగుస్తాయి.

అనంత్ అంటే ఎమోషనల్..

అనంత్ అంబానీ వివాహం మాత్రం ముకేశ్, నీతాకు ఏదో తెలియని ఎమోషనల్ ఫీల్‌ అన్నట్లుగా ఉంది. చిన్న కుమారుడంటే అమితమైన ప్రేమ.. అస్తమా లాంటి తీవ్ర అనారోగ్య సమస్యలను దాటి వచ్చాడన్న తెలియని భావోద్వేగం.. వాళ్ల కళ్లలో కనిపిస్తూ ఉంటుంది. అనంత్ అంబానీ పేరు తీస్తేనే చాలు నీతా అంబానీ ఎమోషనల్ అయిపోతారు. మామూలు విషయమా. అంతా బాండింగ్ ఉన్న చిన్నకుమారుడి మ్యారేజ్ మామూలుగా చేయొద్దని ఫిక్స్ అయిపోయింది ముకేశ్ ఫ్యామిలీ. ఖర్చు విషయంలో వెనకాడ లేదు. తరలివచ్చే అతిథులకు ఆతిధ్యానికి లోటు లేదు. స్వాగతానికి ఫిదా అయ్యారు.

పెళ్లి పత్రిక నుంచి వివాహ వేదిక వరకు, ధరించే దుస్తులు నుంచి అతిథులకు వడ్డించే భోజనాల వరకు అన్నీ స్పెషలే. ఎంగేజ్‌మెంట్, ప్రీ వెడ్డింగ్‌నే ఓ రేంజ్‌లో చేసిన ముకేశ్ అంబానీ.. అనంత్ అంబానీ పెండ్లి వేడుకను కనీవినీ ఎరుగని రీతిలో జరిగింది. మూడ్రోజుల పెండ్లి వేడుక అంటే మామూలు విషయం కాదు. స్వర్గమే భూలోకానికి దిగొచ్చిందన్న ఫీలింగ్ కలిగేలా.. తారాలోకం తరలివచ్చింది. అతిరథ మహారథులు కొత్త జంటను ఆశీర్విదించారు.

భోజనాలకు 230 కౌంటర్లు..

అనంత్ అంబానీ పెళ్లిలో దాదాపు 3 వేల రుచులు అతిథులకు వడ్డించారు. దేశ విదేశీ ప్రముఖులు రావడంతో భారతీయ రుచులతో పాటు, కాంటినెంటల్ వంటకాలన్నింటినీ మెనూలో చేర్చారు. ప్రపంచం నలుమూలల్లో దొరికే దాదాపు అన్ని రకాల ప్రధాన వంటకాల్ని అనంత్ అంబానీ పెళ్లిలో వడ్డించారు. వరల్డ్ క్లాస్ ఫుడ్ ఫెస్టివల్ లాగా అన్నిరకాల వంటకాలు వడ్డించారు. కేవలం భోజనాల కోసమే 230 కౌంటర్లు ఏర్పాట్లు చేశారు.

Anant Ambani wedding live updates: Couple set to tie the knot soon |  Hindustan Times

 

 

Exit mobile version
Skip to toolbar