Thunderbolts : సాధారణంగా వర్షాలు.. ఉరుములు.. మెరుపులు అనేవి సర్వ సాధారణం. కానీ అనుకోని రీతిలో పిడుగుపాటుకు పలువురు మృత్యువాత పడిన ఘటనలను మనం చూస్తున్నాం. అయితే ఒక ప్రాంతంలో ఏకంగా 5,450 పిడుగులు పడ్డాయి. అదికూడా అర గంట వ్యవధిలో.. భీకరమైన శబ్దాలతో విజృంభిస్తే ఎలా ఉంటదో ఊహించడానికే భయంగా ఉంది. కానీ ఈ ఘటన తాజాగా చోటు చేసుకుంది. అది కూడా మనదేశంలో అంటే అందరూ షాక్ అవ్వడం గ్యారంటీ అని చెప్పవచ్చు. కానీ నిజంగానే ఈ అనూహ్య ఘటన తాజాగా జరిగింది.
ఒడిశా లోని భద్రక్ జిల్లా బాసుదేవపూర్‌లో బుధవారం సాయంత్రం ఆకాశం కన్నెర్ర జేసింది. కేవలం అరగంట వ్యవధిలో 5,450 పిడుగులు పడ్డాయి. వరుసగా పిడుగులు పడుతుండటంతో జనాలు దిక్కుతోచని స్థితిలో మిన్నకుండిపోవాల్సిన దయనీయ పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటనలో ప్రాణ, ఆస్తి నష్టం లేకపోయినప్పటికీ పిడుగు పాటు శబ్దాలకు బాసుదేవపూర్ ప్రజలు భయాందోళనకు గురయ్యారు.
కారణం ఏంటో చెప్పిన ఐఎండీ అధికారులు (Thunderbolts)..
కాగా ఈ విధంగా ప్రకృతి ప్రకోపించడానికి కారణం ఏంటి అని ఐఎండీ అధికారులు వివరించారు. క్యుములోనింబస్ మేఘాలు రాపిడికి గురైనపుడు ఇలా జరుగుతుందని గోపాల్‌పూర్ డాప్లార్ రాడార్ కేంద్రం (ఐఎండీ) అధికారి ఉమాశంకర్ దాస్ తెలిపారు. ఇలా జరగడం మొదటి సారి కాదని గతంలో కూడా జరిగాయని తెలిపారు. పిడుగుపాటును గుర్తించే అత్యాధునిక సాంకేతికత రాడార్ తమ కేంద్రానికి ఉందని ఆయన తెలిపారు.కానీ కోడి సమయంలోనే అన్ని పిడుగులు పడడం పట్ల ప్రజలంతా ప్రాణ భయంతో అల్లాడిపోయినట్లు తెలుస్తుంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.