Site icon Prime9

IRCTC Package: ఐఆర్‌సీటీసీ ప్రత్యేకమైన టూర్‌ ప్యాకేజీ.. రూ.20 వేలకే గంగా రామాయణ్‌ యాత్ర

IRCTC

IRCTC

IRCTC Package: ఐఆర్ సీటీసీ అందుబాటులో మంచి టూర్ ప్యాకేజీలను అందిస్తోంది. పర్యాటక ప్రాంతాలు.. దర్శనీయ స్థలాలను కవర్ చేస్తూ అనేక ప్యాకేజీలను అందుబాటులోకి తెస్తుంది. దీంట్లో భాగంగానే.. వారణాసి నుంచి లక్నో వరకు గంగా రామాయణ్ యాత్ర పేరుతో ఓ ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది. మరి ఈ యాత్ర విశేషాలేంటో చూద్దాం.

రూ. 20 వేలకే ప్యాకేజీ.. (IRCTC Package)

ఐఆర్ సీటీసీ అందుబాటులో మంచి టూర్ ప్యాకేజీలను అందిస్తోంది. పర్యాటక ప్రాంతాలు.. దర్శనీయ స్థలాలను కవర్ చేస్తూ అనేక ప్యాకేజీలను అందుబాటులోకి తెస్తుంది.

దీంట్లో భాగంగానే.. వారణాసి నుంచి లక్నో వరకు గంగా రామాయణ్ యాత్ర పేరుతో ఓ ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది. మరి ఈ యాత్ర విశేషాలేంటో చూద్దాం.

దేశంలో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాల్లో పర్యటించేందుకు ఐఆర్‌సీటీసీ ప్రత్యేకమైన టూర్‌ ప్యాకేజీలను అందిస్తోంది.

ప్యాకేజీలకు నిర్దేశించిన మెుత్తాన్ని చెల్లిస్తే.. దర్శనీయ ప్రాంతాలను వాటి ప్రాముఖ్యతను తెలియజేస్తారు.

అందులో భాగంగానే ‘గంగా రామాయణ్‌ యాత్ర ’ పేరిట ఐఆర్‌సీటీసీ అవకాశం కల్పిస్తోంది.

ఈ పర్యటనలో భాగంగా.. నైమిశారణ్య, ప్రయాగ్‌రాజ్‌, సారనాథ్‌, వారణాసి పుణ్యక్షేత్రాలను చూపిస్తారు. ఇది ఐదురోజులు రాత్రులు.. ఆరు పగళ్లు కొనసాగుతుంది.

హైదరాబాద్ నుంచి ఈ యాత్ర ప్రారంభం అవుతుంది.

చివరగా లక్నో నుంచి హైదరాబాద్ తిరుగు ప్రయాణంతో ఇది పూర్తవుతుంది. 2023 మే 25న, తిరిగి జూన్‌ 7న ఈ యాత్ర ప్రారంభమవుతుంది.

యాత్ర సాగుతుందిలా..

తొలి రోజు హైదరాబాద్‌ నుంచి యాత్ర ప్రారంభం అవుతుంది. నేరుగా వారణాసిలో బుల్ చేసిన హోటల్ కు చేరుకుంటారు.

మధ్యాహ్నం భోజనం తర్వాత.. యాత్రకు తీసుకెళ్తారు. ఆలయం, ఘాట్‌కు వెళ్లేటపుడు అయ్యే ఖర్చులను మనమే భరించుకోవాల్సి ఉంటుంది.

రెండో రోజు అల్పాహారం తర్వాత.. సారనాథ్‌కు తీసుకెళ్తారు. దర్శనం తర్వాత మళ్లీ వారణాసికి చేరుకుంటారు.

బిర్లా ఆలయం.. ఘాట్ల సందర్శన ఉంటుంది. రాత్రికి షాపింగ్‌ అనేది యాత్రికుల ఇష్టం.

మూడో రోజు ప్రయాగ్‌రాజ్‌ వెళ్లాల్సి ఉంటుంది. అక్కడే అలోపీ దేవీ ఆలయం, త్రివేణి సంగమాన్ని సందర్శిస్తారు.
నాలుగో రోజు అయోధ్యలోని ఆలయం.. ఐదో రోజు లక్నోకి చేరుకుంటారు.

ఇక ఆరో రోజు అల్పహారం తర్వాత లక్నో చారిత్రక కాంప్లెక్స్ ను సందర్శిస్తారు.

సాయంత్రం హైదరాబాద్ తిరుగు ప్రయాణం అవుతారు.

ప్యాకేజీలో అందేవి..

వెళ్లడానికి, రావడానికి విమాన టికెట్లు.
రెండు రాత్రులు వారణాసిలో, ఒక రాత్రి అయోధ్యలో, రెండు రాత్రులు లక్నోలో బస
ఐదు రోజులు అల్పాహారం, రాత్రి భోజనం. మధ్యాహ్న భోజనం మాత్రం ఒక రోజే ఉంటుంది.

ప్యాకేజీ ఛార్జీలు.. (ఒకరికి)
సింగిల్‌ ఆక్యుపెన్సీ- రూ.36,850
డబుల్‌ ఆక్యుపెన్సీ- రూ.29,900
ట్రిపుల్‌ ఆక్యుపెన్సీ- రూ.28,200
చిల్డ్రేన్ విత్‌ బెడ్‌ (5- 11ఏళ్లు)- రూ.24,600
చైల్డ్‌ వితౌట్‌ బెడ్‌ (5- 11ఏళ్లు)- రూ.24,600
చైల్డ్‌ వితౌట్‌ బెడ్‌ (2- 4ఏళ్లు)- రూ.18,300

Exit mobile version