Gold Rates Hike: పండుగ వేళ పసిడి ధరలు వినిగదారులకు షాక్ నిచ్చాయి. ధన్‌తేరాస్( ధన త్రయోదశి) సందర్భంగా బంగారం ధరలు భగ్గుమన్నాయి.
- హైదరాబాద్‌లో 24 క్యారెట్ల పుత్తడి 10 గ్రాములు (తులం) ధర ఒక్కసారిగా రూ.830 పెరిగి రూ.51,280కి చేరింది. 22 క్యారెట్ల ఆభరణాల పసిడి ధర రూ.750 పెరిగి రూ.47,000లకు చేరింది. ఇదిలా ఉండగా మరోవైపు స్థానికంగా కిలో వెండి ధర సైతం రూ.1,700 పెరిగి కిలో వెండి రూ.63,200లకు చేరింది.
- ఇక దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం తులం రూ.840 పెరిగి రూ.51,440 వద్దకు చేరగా, ముంబైలో రూ.830 ఎగబాకి రూ.51,280గా ఉంది.
దేశవ్యాప్తంగా ధన్‌తేరాస్ (ధన త్రయోదశి) సందడి మొదలైంది. ఈసారి ధన త్రయోదశి ఆదివారం నాడు శుభదినంగా ఉన్నప్పటికీ, శనివారం మధ్యాహ్నం 2 గంటల నుంచే ముహూర్తం వచ్చిందని, అది ఆదివారం సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ఉంటుందని వేద పండితులు అంటున్నారు. దానితో మార్కెట్‌లో ఈ ప్రభావం కనిపిస్తున్నది. కాగా, హిందూ సంప్రదాయంలో కొత్త వస్తువులు, ముఖ్యంగా బంగారం, వెండి ఆభరణాల కొనుగోళ్లకు ధన్‌తేరాస్ శుభప్రదమైన రోజుగా విశ్వసిస్తారు ఈ విషయం అందరికీ తెలిసిందే. కాగా ఈ ఏడాది ఈ ధన్‌తేరాస్‌కు దాదాపు దేశవ్యాప్తంగా రూ.40,000 కోట్ల వ్యాపారం జరగవచ్చని అఖిల భారత వర్తకుల సమాఖ్య (సీఏఐటీ) అంచనా వేసింది. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు ఈ ధన త్రయోదశికి సిరిసంపదలను ఆహ్వానించండి.
ఇదీ చదవండి: దీపావళికి ఈ 4 లక్ష్మీ ఆలయాలను సందర్శిస్తే సిరిసంపదలు మీ సొంతం