Prime9

Electric Wires Cut Down: తెగిపడిన కరెంట్ వైర్లు.. హైదరాబాద్ లో ఇద్దరి సజీవ దహనం!

Electric Wires Cut Down in Hyderabad: హైదరాబాద్ ఎల్బీనగర్ లో విషాదం నెలకొంది. చింతల్ కుంట ఏరియాలో ఇవాళ తెల్లవారుజామున హైటెన్షన్ కరెంట్ వైర్లు తెగిపడి ఇద్దరు సజీవదహనమయ్యారు. అక్కడే నిద్రిస్తున్న ఓ శునకం కూడా కాలి బూడిదైంది. కాగా చింతల్ కుంట ప్రాంతంలో రోడ్డుపక్కన ఉన్న ఫుట్ పాత్ పై ఇద్దరు వ్యక్తులు నిద్రిస్తున్నారు. ఈక్రమంలోనే వారిపై హైటెన్షన్ కరెంట్ వైర్లు తెగి వారిపై పడిపోయాయి. ప్రమాదంలో మంటలు అంటుకుని ఇద్దరు పూర్తిగా కాలిపోయారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, విద్యుత్ అధికారులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు ఆరా తీశారు. విద్యుత్ సరఫరా నిలిపివేసి సహాయక చర్యలు చేపట్టారు. చనిపోయినవారు యాచకులుగా గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

 

 

 

Exit mobile version
Skip to toolbar