Prime9

Road accident on ORR: ఔటర్ రింగ్ రోడ్డుపై కారులో మంటలు.. ఇద్దరు సజీవ దహనం

Accident on the Hyderabad Outer Ring Road: పెద్దఅంబర్‌పేట సమీపంలోని ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం జరిగింది. ఓ వాహనాన్ని కారు ఢీకొట్టిగా, మంటలు చెలరేగి రెండు వాహనాలు కాలిపోయాయి. ఇవాళ తెల్లవారుజామున 3 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది. ఆగి ఉన్న వాహనాన్ని టాటా క్వారీ వాహనం ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో కారులో ముగ్గురు వ్యక్తులు ఉండగా, ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే సజీవ దహనం అయ్యారు. స్థానికులు మరొకరిని మంటల నుంచి కాపాడి ఆసుపత్రికి తరలించారు.

 

శంషాబాద్ వైపు నుంచి ఘట్‌కేసర్ వెళ్తుండగా అబ్దుల్లాపూర్‌‌మెట్‌ మండలం గండిచెరువు సమీపంలోని ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదం జరిగింది. ఔటర్ రింగ్ రోడ్డు అవతలి వైపు ఓ వాహనం ప్రమాదానికి గురై డివైడర్‌ను ఢీకొట్టింది. వారికి సహాయం చేయడానికి వాహనాన్ని పక్కనే నిలిపినట్లు సమాచారం. ఇదే సమయంలో ఆగి ఉన్న వాహనాన్ని కారు వెనుక నుంచి ఢీకొట్టినట్లు సమాచారం. ప్రమాదంలో రెండు వాహనాలు కాలిపోయాయి.

 

పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది హుటహుటిన అక్కడికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. అబ్దుల్లాపూర్‌‌మెట్‌ పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మృతులు హైదరాబాద్‌లోని బహదూర్‌పురకు చెందిన దీపేశ్‌ అగర్వాల్‌ (23), విజయ్‌ నగర్‌ కాలనీకి చెందిన సంచయ్‌ మల్పాని (22), మూసాపేటకు చెందిన ప్రియాన్షు మిట్టల్‌ (23)గా పోలీసులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Exit mobile version
Skip to toolbar