Prime9

Sunny Yadav Arrest: యూట్యూబర్‌ భయ్యా సన్నీ యాదవ్‌ అరెస్ట్‌ – పాకిస్థాన్‌ టూర్‌పై ఆరా!

Youtuber Sunny Yadav Arrested: ట్రావెలర్‌, యూట్యూబర్‌ భయ్యా సన్నీ యాదవ్‌ను ఎన్‌ఐఏ అధికారులు అరెస్ట్‌ చేశారు. చెన్నై ఎయిర్‌పోర్టులో అధికారులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అతడు ఎన్‌ఐఏ పోలీసుల అదుపులో ఉన్నాడు. పాకిస్తాన్‌ టూర్‌పై అతడిని ఆరా తీస్తున్నట్టు సమాచారం. కాగా భయ్యా సన్నీ యాదవ్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బైక్‌పై విదేశాలకు టూర్లకు వెళుతుంటాడు. వాటిని తన యూట్యూబ్‌ ఛానల్లో అప్‌డేలోడ్‌ చేస్తుంటాడు.

 

ఇటీవల అమెరికా నుంచి వచ్చిన అతడు.. రెండు వారాల క్రితం పాకిస్తాన్‌ వెళ్లాడు. ప్రస్తుతం పాకిస్తాన్‌, ఇండియా మధ్య నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో సన్నీ యాదవ్‌ని పోలీసులు అరెస్ట్‌ చేసి పాకిస్తాన్‌ పర్యటనకు సంబంధించిన వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. పాకిస్తాన్‌లో ఎవరితోనైనా అతడికి సంబంధాలు ఉన్నాయా? ఏదైనా గూఢాచర్యం చేశాడా? అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. కాగా బెట్టింగ్‌ యాప్‌ ప్రమోషన్ల వ్యవహరంలో సన్నీ యాదవ్‌పై ఇప్పటికే కేసు నమోదైన సంగతి తెలిసిందే.

 

మార్చి 5న సూర్యాపేట జిల్లా నూతనకల్‌ పోలీసు స్టేషన్‌లో సన్నీ యాదవ్‌పై కేసు నమోదైంది. విచారణలో భాగంగా సన్నీయాదవ్‌ విదేశాల్లో ఉండటంతో సన్నీ యాదవ్‌ లుక్‌ అవుట్‌ నోటీసులు ఇష్యూ చేసి అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. యూఎస్‌ఏ బైక్‌ టూర్‌ని పూర్తి చేసుకున్న అతడు ఇండియా వచ్చాడు. ఇండియా నుంచి వాఘా సరిహద్దు గుండా పాకిస్తాన్‌ దేశంలోకి వెళ్లాడు. పాకిస్తాన్‌ బైక్‌ టూర్‌ ముగించుకున్న అతడి ఇండియా తిరిగి వచ్చిన అతడిని చెన్నై ఎయిర్‌పోర్టులో ఎన్‌ఐఏ అధికారులు అరెస్ట్‌ చేశారు.

Exit mobile version
Skip to toolbar