Ponguleti on Telangana Sarpanch Elections: ఈ నెలాఖరులోగా స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. తొలుత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు రేపు జరిగే కేబినెట్‌లో చర్చించి ఎన్నికల తేదీపై స్పష్టత ఇస్తామన్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల అనంతరం సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలు జరగనున్నట్లు వెల్లడించారు.
అయితే, ఎన్నికలకు మరో 15 రోజులకే సమయం ఉండడంతో కాంగ్రెస్ నాయకులు సిద్దంగా ఉండాలని సూచించారు. రాష్ట్రంలో ఉన్న అన్ని స్థానాల్లో అభ్యర్థులు పోటీ చేస్తారని.. గెలిచే అవకాశం ఎవరికైతే ఉందో వాళ్లనే నిలబెడ్తామని చెప్పారు. ఇదిలా ఉండగా, మరో వారం రోజుల్లో ‘రైతు భరోసా’ నిధులు జమ చేయనున్నట్లు తెలిపారు. అలాగే సన్నబియ్యానికి బోనస్ కూడా రైతుల అకౌంట్లో జమ అవుతుందన్నారు. కావున కాంగ్రెస్ కార్యకర్తలు సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.