Prime9

Governor Tour: రేపు యాదాద్రి జిల్లాకు గవర్నర్.. చేనేత కార్మికులతో ముఖాముఖి

Yadadri Bhuvangiri: గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ రేపు యాదాద్రి భువనగిరిలో పర్యటించనున్నారు. ఈ మేరకు కలెక్టర్ హనుమంతరావు గవర్నర్ పర్యటనకు సంబంధించి అధికారులతో ఏర్పాట్లను పర్యవేక్షించారు. ముందుగా చేనేత జౌలిశాఖ రాష్ట్ర అధికారులతో కలిసి టూరిజం పార్క్ తో పాటు సమీపంలోని చేనేత కార్మికుల ఇళ్లను పరిశీలించారు. టెక్స్ టైల్ పార్క్ లో చేనేత వస్త్రాల తయారీ విధానాలను గవర్నర్ పరిశీలించనున్న నేపథ్యంలో పార్కులో తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

 

అలాగే టెక్స్ టైల్ పార్క్ లోని కాన్ఫరెన్స్ హాల్ లో చేనేత కార్మికులు, కళాకారులు, పలువురితో గవర్నర్ ముఖాముఖి నిర్వహించనున్నారు. అలాగే చేనేత బీమా, త్రిఫ్ట్ పథకం చెక్కులను లబ్ధిదారులకు గవర్నర్ అందించనున్నారని అధికారులు చెప్పారు. దీంతో చెక్కులను తీసుకునే పోచంపల్లి, కుంట్లగూడేనికి చెందిన చేనేత కార్మికులు సమాచారం అందించి, సకాలంలో కార్యక్రమానికి హాజరయ్యేలా అధికారులు ప్రణాళికలు చేస్తున్నారు. మరోవైపు చేనేత కార్మికుల ఇళ్లను సందర్శించి, మగ్గాలను ప్రత్యక్షంగా పరిశీలించనున్నారు. అనంతరం చేనేత, జౌళి, రెవెన్యూ, మున్సిపల్ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించనున్నారు. గవర్నర్ పర్యటన నేపథ్యంలో అధికారులు గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు.

Exit mobile version
Skip to toolbar