Prime9

Telangana: సర్కారు కీలక నిర్ణయం.. రెండుసార్లు కేబినెట్ మీటింగ్

Cabinet Meeting: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు వీలు కుదిరినప్పుడు మంత్రివర్గ సమావేశం నిర్వహిస్తున్న ప్రభుత్వం.. ఇక నుంచి ఆ పంథా మార్చుకోనుంది. ఇక మీదట ప్రతినెలా రెండుసార్లు కేబినెట్ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి 15 రోజులకు ఒకసారి కేబినెట్ మీటింగ్ నిర్వహించాలని సీఎం రేవంత్ నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే మొదటి, మూడో శనివారం కేబినెట్ సమావేశం జరగనుంది. కాగా పథకాలు, అభివృద్ధిపై మంత్రివర్గం క్రమం తప్పకుండా సమీక్షలు చేయనుంది. దీంతో పాలన పరంగా, పథకాల అమలులో ఉన్న లోపాలను సరిదిద్ధే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు నెలకు రెండుసార్లు సమీక్ష నిర్వహించడం వల్ల అధికారులు సైతం ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారంతో పాలనలో పారదర్శకత రానుంది.

 

Exit mobile version
Skip to toolbar