Prime9

Telangana Cabinet: నేడు తెలంగాణ మంత్రివర్గ విస్తరణ.. కొత్తగా ముగ్గురికి ఛాన్స్

Expansion: నేడు తెలంగాణ కేబినెట్ విస్తరణ జరగనుంది. సీఎం రేవంత్ మంత్రివర్గంలోకి కొత్తగా ముగ్గురికి చోటు కల్పించారు. కాగా కేబినెట్ విస్తరణలో గడ్డం వివేక్ వెంకటస్వామి, కవ్వంపల్లి సత్యనారాయణ, వాకిటి శ్రీహరికి అవకాశం ఇస్తున్నారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి వారికి స్వయంగా ఫోన్ చేసి చెప్పినట్టు సమాచారం.

 

కొత్తగా మంత్రులుగా ఎంపికైన నేతల జాబితాను కాసేపట్లో రాజ్ భవన్ కు పంపించనున్నారు. కాగా రాజ్ భవన్ లో ఇవాళ మధ్యాహ్నం 12.45 గంటలకు కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం చేయనున్నారు. కాగా తాజాగా చేపడుతున్న మంత్రివర్గ విస్తరణలో మాల, మాదిగ, బీసీ సామాజిక వర్గాల నుంచి నేతలను ఎంపిక చేసినట్టు సమాచారం. విస్తృత చర్చల అనంతరం విస్తరణపై అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది. మరోవైపు డిప్యూటీ స్పీకర్ గా రామచంద్రునాయక్ నియామకం కానున్నట్టు సమచారం.

Exit mobile version
Skip to toolbar