Telangana Govt. Releases Rythu Bharosa Funds: రైతులకు వానాకాలం పంట పెట్టుబడి సాయం కింద రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా నిధులను విడుదల చేసింది. 2 ఎకరాల లోపు భూమి ఉన్న రైతుల ఖాతాల్లో నిన్న రైతు భరోసా నిధులు జమ అయ్యాయి. ఒక్కరోజులో 41.25 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ. 2349.83 కోట్ల నిధులను ప్రభుత్వం జమ చేసింది. ఎకరం లోపు భూమి ఉన్న 24.22 లక్షల మంది రైతులకు రూ. 812.6 కోట్లు, రెండెకరాల వరకు భూమి ఉన్న 17.02 లక్షల మంది రైతులకు రూ. 1537.2 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది.
మిగిలిన రైతులకు వచ్చే 9 రోజుల్లోగా రైతు భరోసా నిధులు జమ చేస్తామని సీఎం రేవంత్, మంత్రి తుమ్మల ప్రకటించారు. కాగా ఇప్పటికే పలు ప్రాంతాల్లోని రైతులు వ్యవసాయ పనులు మొదలుపెట్టారు. తాజగా అందుతున్న సాయంతో ట్రాక్టర్ల కిరాయిలు, విత్తనాలు, ఎరువుల కొనుగోలు, కూలీల ఖర్చుకు ఉపయోగపడనున్నాయి. కాగా రైతు భరోసా నిధులు విడుదల అవడంతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.