Prime9

Hawala cash: రూ.2.4కోట్ల హవాలా నగదు పట్టివేత

Hyderabad: హైదరాబాదు కేంద్రంగా హవాలా రాకెట్ కోట్లల్లో సాగుతుంది. ఇప్పటివరకు దీనిపై పోలీసులు ప్రత్యక దృష్టి పెట్టలేదు. తాజాగా మునుగోడు ఉప ఎన్నికల్లో భాగంగా టాస్క్ ఫోర్సు పోలీసులు తనిఖీల నేపథ్యంలో హైదరాబాదులో పలు హవాలా ముఠాలు ఉన్నట్లు తేలుతుంది.

బంజారా హిల్స్ లో ఓ వాహనంలో రూ. 2.4 కోట్ల నగదును తరలిస్తూ పోలీసులకు పట్టుబడింది. గడిచిన వారం రోజుల్లో రూ. 10.96 కోట్ల రూపాయల మేర హవాలా నగదు పోలీసులకు పట్టుపడింది. గతంలో హైదరాబాదు పోలీసులు నగరంలో ఎలాంటి తనిఖీలు చేపట్టడం లేదని రూఢీ అవుతుంది.

సెప్టెంబర్ 29న 1.24 కోట్లు, అక్టోబర్ 7న వెంకటగిరిలో రూ. 54 లక్షలు, 8న చంద్రాయన్ గుట్ట వద్ద రూ. 79 లక్షలు, 9న జూబ్లీహిల్స్ లో రూ. 2.49 కోట్లు, 11వ తేదీన గాంధీ నగర్ లో రూ 3.5 కోట్ల రూపాయలను టాస్క్ ఫోర్స్ పోలీసు సిబ్బంది సీజ్ చేశారు. పలు వాహనాలు, సెల్ ఫోన్లు, సంబంధిత వ్యక్తులను అదుపులోకి తీసుకొన్నారు. విచారణలో హవాలా రాకెట్ ను కొనసాగిస్తున్న ముఠాలు బయటపడనున్నాయి.

ఇది కూడా చదవండి: రూ.3.5 కోట్ల హవాలా నగదు పట్టివేత

Exit mobile version
Skip to toolbar